MI Vs GT: అయ్యో.! అయ్యయ్యో.. హార్దిక్‌ను మరీ ఇంత నీచంగానా.. స్టేడియంలోకి కుక్క ఎంట్రీతో..

ఐపీఎల్ 2024 సీజన్ ఇలా ప్రారంభమైందో.. లేదో.. జరిగిన 5 మ్యాచ్‌లకే ఫ్యాన్స్‌కు కావల్సినంత ఎంజాయ్‌మెంట్ దక్కింది. రాజస్తాన్, లక్నో మ్యాచ్‌లో స్పైడర్ కామ్ వైర్ తెగిపోయి.. మ్యాచ్ కాసేపు ఆగగా.. అటు ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో మాత్రం ఎన్నో సంచలన సీన్‌లు చోటు చేసుకున్నాయి. మరి అవేంటో చూసేద్దామా.. ఈ స్టోరీలో తెలుసుకోండి..

MI Vs GT: అయ్యో.! అయ్యయ్యో.. హార్దిక్‌ను మరీ ఇంత నీచంగానా.. స్టేడియంలోకి కుక్క ఎంట్రీతో..
Hardik Pandya
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2024 | 12:39 PM

ఐపీఎల్ 2024 సీజన్ ఇలా ప్రారంభమైందో.. లేదో.. జరిగిన 5 మ్యాచ్‌లకే ఫ్యాన్స్‌కు కావల్సినంత ఎంజాయ్‌మెంట్ దక్కింది. రాజస్తాన్, లక్నో మ్యాచ్‌లో స్పైడర్ కామ్ వైర్ తెగిపోయి.. మ్యాచ్ కాసేపు ఆగగా.. అటు ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో మాత్రం ఎన్నో సంచలన సీన్‌లు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్‌లోనే కాదు.. పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలోనూ జంతువులు గ్రౌండ్‌లో వస్తుండటం సర్వసాధారణం. సరిగ్గా ఇలాంటి సీన్ గుజరాత్, ముంబై మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది ఐదో మ్యాచ్.. అలాగే ఈ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్. ముంబై టీం బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ స్ట్రీట్ డాగ్ గ్రౌండ్‌లో హల్చల్ చేసింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తున్న తరుణంలో.. మొదటి బంతి వేసిన తర్వాత ఒక వీధి కుక్క మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఒకవైపు కుక్క పరుగు.. మరోవైపు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం హోరెత్తిపోయింది. అయితే ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుక్కను ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే గుజరాత్ ఫ్యాన్స్.. హార్దిక్‌ను కుక్కతో పోలుస్తూ.. దారుణంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుమ్రా విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 13 పరుగులిచ్చి 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. అయితే లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై చతికిలబడింది. చివరికి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.