MS Dhoni New Look: ధోని @ 2004.. నయా లుక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..
Anant Ambani And Radhika Merchant Pre Wedding: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన లుక్స్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుంటాడు. ధోని మరోసారి తన పాత స్టైల్‌లో మెరిశాడు. ధోనీ ఎంతో కూల్‌గా కనిపిస్తున్న ఈ ఫొటో సర్వత్రా వైరల్ అవుతోంది.

Anant Ambani And Radhika Merchant Pre Wedding: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన లుక్, స్టైల్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ధోని మరోసారి తన లుక్‌ని మార్చుకున్నాడు. మరలా తన పాత స్టైల్‌లోకి వచ్చాడు. మహి లుక్, ఫిట్‌నెస్ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఈ టీమిండియా మాజీ సారథి జామ్‌నగర్ చేరుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముందు, ధోని ఫొటో, కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెప్టెన్ కూల్ ఈ ఫొటోలో గతంలో కంటే మరింత స్టైలిష్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నాడు.
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకకు మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. వైరల్ అయిన ఫొటోలలో, మహి సింపుల్ లుక్‌లో కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఫొటోలో, ధోనీ మెరూన్ కలర్ హాఫ్ టీ-షర్ట్, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరించి ఉన్నాడు.
న్యూ లుక్ ఫొటోలో ఎంఎస్ ధోని:
MS Dhoni on his way to attend Anant Ambani and Radhika Merchant pre-wedding.
– The evergreen Thala…!!! 😍🔥 pic.twitter.com/33siMgvZd0
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024
విశేషమేమిటంటే.. భారత క్రికెట్ జట్టులో చేరిన సందర్భంగా ధోనీ ఎలా కనిపించాడో అదే విధంగా మరోసారి పొడవాటి జుట్టు పెంచాడు. దీనితో పాటు, అతను హాఫ్ టీ-షర్ట్‌లో పవర్ ఫుల్ ఫిట్‌నెస్‌ను కూడా చూపించాడు. భారత మాజీ కెప్టెన్ ఈ లుక్‌ని సోషల్ మీడియాలో అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్‌లో ఎంఎస్ ధోని మైదానంలో కనిపించనున్నాడు. గత సీజన్‌లో మహీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది.
ఐపీఎల్ 2025లో కూడా ధోనీ..
ఈ ఐపీఎల్‌లోనే కాకుండా వచ్చే ఐపీఎల్‌లో కూడా మహి ఆడాలనే ఆశ ఉందని ధోనీ చిన్ననాటి స్నేహితుడు పరమజిత్ సింగ్ చెప్పుకొచ్చాడు. CSK కెప్టెన్ మరో రెండు సీజన్లు ఆడతాడని ఆశిస్తున్నాను. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నేను అనుకోను. అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి అతను మరొక సీజన్ లేదా రెండు సీజన్లలో ఆడటం కొనసాగించగలడని నేను భావిస్తున్నాను. ఇంకా ఫిట్‌గా ఉండటమే దీనికి కారణం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




