Kohli vs Gambhir: మళ్లీ కోహ్లీ వర్సెస్ గంభీర్.. మైదానంలోనే డిష్యూం డిష్యూం.. పేలిన మాటల తూటాలు
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. భారత్ క్రికెట్‌లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ముఖ్యంగా గంభీర్ తరచూ విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటాడు. తాజగా లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. భారత్ క్రికెట్‌లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ముఖ్యంగా గంభీర్ తరచూ విరాట్ కోహ్లీని విమర్శిస్తుంటాడు. తాజగా లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 108 పరుగులకే చతికిలపడింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో 18 పరుగులతో పరాజయం పాలైంది. సాధారణంగానే అగ్రెసివ్‌గా కనిపించే విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా కనిపించాడు.
అతనితో మాటలేంటి?
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలోనే గంభీర్-కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగా లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన గంభీర్, అతనితో మాట్లాడకని సైగ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనికి కోహ్లీ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. అమిత్ మిశ్రాతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు లక్నో టీమ్ ప్లేయర్లంతా కలిసి విరాట్ కోహ్లీకి సర్ది చెప్పి, అతన్ని వెనక్కి పంపించారు. ఈ గొడవకి కారణం ఈ రెండు టీమ్స్ మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచేనని తెలుస్తోంది. బెంగళూరులో ఆర్‌సీబీని 1 వికెట్ తేడాతో ఓడించింది లక్నో. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి లక్నో గెలవగానే గౌతమ్ గంభీర్, ఆర్‌సీబీ అభిమానుల వైపు నోరు మూసుకోవాల్సిందిగా సైగ చేశాడు. ఇదే విరాట్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. దీనికి ప్రతీకారంగానే నేటి మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకున్నాక అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు కోహ్లీ.
Virat Kohli vs Gautam Gambhir ??
Yet Again ?
Video Credits : Jio Cinema / Star Sports / IPL / BCCI#LSGvRCB | #IPL | #CricketTwitter pic.twitter.com/F4Fqi31GVJ
— Krish (@archer_KC14) May 1, 2023
Heated argument between Virat Kohli and Gautam Gambhir after the match pic.twitter.com/g2iZDtyMjz
— All About Cricket (@allaboutcric_) May 1, 2023
జరిమానా..
కాగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. 2013 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీ , గౌతమ్ గంభీర్‌లకు భారీగా జరిమానా విధించింది బీసీసీఐ. మ్యాచ్ ఫీజులో 100% కోత విధించింది. అలాగే లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.
I am Repeating: Don’t Mess with KING ??
King ra luchha @GautamGambhir ?#LSGvRCB #LSGVsRCB #ViratKohli? @imVkohli pic.twitter.com/jfojs091zb
— ADAM (@N2Sharath) May 1, 2023
Sore loser Gambhir ?
— Cricket is Life❤️ (@suhailmir91) May 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..