Virat Kohli: మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. విరాట్ ఏం చేశాడో తెలుసా? వైరల్ వీడియో
లక్నో బ్యాటింగ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని మరీ నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లాడు. కింగ్ పాదాలకు దండం పెట్టాడు. అభిమాని సడెన్‌గా అలా చేయడంతో విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతనిని పైకి లేపి ఆప్యాయంగా హత్తుకున్నాడు.
టీమిండియా రన్ మెషిన్, కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. ఈక్రమంలో ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో బ్యాటింగ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని మరీ నేరుగా కోహ్లీ వద్దకు వెళ్లాడు. కింగ్ పాదాలకు దండం పెట్టాడు. అభిమాని సడెన్‌గా అలా చేయడంతో విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతనిని పైకి లేపి ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ తర్వాత గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లమన్నాడు. అయితే కోహ్లీని కలిసిన ఆ ఆభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. మైదానంలోనే గెంతులు, కేకలు వేస్తూ బయటకు వచ్చాడు సందర్ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా గ్రౌండ్‌లోకి సడెన్‌గా దూసుకొచ్చిన అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. లక్నోపై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 108 పరుగులకే చతికిలపడింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో 18 పరుగులతో పరాజయం పాలైంది లక్నో.
King of World Cricket.
Kohli is loved by millions & won the hearts of everyone. pic.twitter.com/gPMmzp9tDH
— Johns. (@CricCrazyJohns) May 1, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..