IPL 2023 Final CSk vs GT: ఐపీఎల్ 2023లో అవార్డుల పంట.. ఎవరికి ఏ టైటిల్ దక్కిందంటే?

IPL 2023 Award Winners: ఫైనల్‌లో ఆడిన జట్లే కాకుండా, ఇతర జట్లు, కొంతమంది ఆటగాళ్లు ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. ఈసారి అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2023 Final CSk vs GT: ఐపీఎల్ 2023లో అవార్డుల పంట.. ఎవరికి ఏ టైటిల్ దక్కిందంటే?
Ipl 2023 Final Chennai Supe
Follow us
Venkata Chari

|

Updated on: May 30, 2023 | 9:27 AM

IPL 2023 Award Winners: ప్రపంచంలోని అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ IPL సీజన్ 16 ఘనంగా ముగిసింది. ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో CSK 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. 25 బంతుల్లో 47 పరుగులు చేసిన డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. చివరి రెండు బంతుల్లో CSKకి 10 పరుగులు కావాలి. ఐదో బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ బాదిన రవీంద్ర జడేజా సీఎస్‌కేను ఐపీఎల్‌లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిపాడు.

దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ఆటగాళ్లలో రోహిత్‌ను సమం చేశాడు. ఇతర జట్లతోపాటు ఆటగాళ్లు కూడా ప్రత్యేక అవార్డులను గెలుచుకున్నారు. మరి ఎవరికి ఏ అవార్డు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

ఛాంపియన్స్: చెన్నై సూపర్ కింగ్స్, రూ. 20 కోట్లు + ట్రోఫీ

ఇవి కూడా చదవండి

రన్నరప్: గుజరాత్ టైటాన్స్, రూ. 13 కోట్లు.

మూడో స్థానం: ముంబై ఇండియన్స్, రూ. 7 కోట్లు.

నాలుగో స్థానం: లక్నో సూపర్ జెయింట్స్, రూ.6.5 కోట్లు.

ఎమర్జింగ్ ప్లేయర్: యశస్వి జైస్వాల్, ట్రోఫీ + రూ. 20 లక్షలు.

ఆరెంజ్ క్యాప్: శుభమాన్ గిల్, ఆరెంజ్ క్యాప్ + రూ. 15 లక్షలు.

పర్పుల్ క్యాప్: మహ్మద్ షమీ, పర్పుల్ క్యాప్ + రూ. 15 లక్షలు.

అత్యంత విలువైన ఆటగాడు: శుభమాన్ గిల్, ట్రోఫీ + రూ. 12 లక్షలు

సూపర్ స్ట్రైకర్: గ్లెన్ మాక్స్‌వెల్, ట్రోఫీ + రూ. 10 లక్షలు

ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్: డెవాన్ కాన్వే, ట్రోఫీ + రూ. 1 లక్ష.

అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు: ఫాఫ్ డుప్లెసిస్, ట్రోఫీ + రూ. 12 లక్షలు.

ఫెయిర్‌ప్లే అవార్డు: ఢిల్లీ క్యాపిటల్స్.

క్యాచ్ ఆఫ్ ది సీజన్: రషీద్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!