Watch Video: గాల్లో తేలుతూ.. ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
RR vs DC: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ అద్భుతమైన క్యాచ్ తీసుకొని పృథ్వీ షాను పెవిలియన్‌కు పంపాడు. శాంసన్ క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
IPL 2023 Sanju Samson: ఐపీఎల్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా బ్యాట్ అస్సలు మాట్లాడడంలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫ్లాప్‌గా నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా మూడు బంతులు ఆడి సున్నాకి ఔటయ్యాడు. అతని వికెట్‌ను ట్రెంట్ బౌల్ట్ తీశాడు. అయితే ఈ వికెట్‌లో ట్రెంట్ బౌల్ట్‌కు సమానంగా కెప్టెన్ సంజూ శాంసన్ క్రెడిట్ అందుకున్నాడు.
అసలైన, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ సమయంలో అద్భుతమైన క్యాచ్ తీసుకొని పృథ్వీ షాను అవుట్ చేశాడు. సంజు శాంసన్ ఈ క్యాచ్ వీడియో ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అద్భుతమైన క్యాచ్..
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ బంతిని మిడిల్ లైన్ నుంచి విసిరాడు. పృథ్వీ ఆ బంతిని ఆన్ సైడ్‌లో ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, అతను సరైన సమయం ఇవ్వలేకపోయాడు. ఈ కారణంగా బ్యాట్ అంచు తగిలి బంతి వెనక్కి వెళ్లింది. ఈ బంతి వికెట్ కీపర్, స్లిప్ మధ్య వెళ్తూ నేలను తాకబోతుండగా, మధ్యలో సంజూ శాంసన్ ఒడిసి పట్టాడు. సంజూ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ పృథ్వీ షాకు వికెట్ దక్కింది.
How about THAT for a start! ?
WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over!
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ
— IndianPremierLeague (@IPL) April 8, 2023
ట్రెంట్ బౌల్ట్ తన తర్వాతి బంతికి అదే బంతిని బౌల్డ్ చేయగా, మనీష్ పాండేను మొదటి బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే బట్లర్, జైస్వాల్ కలిసి అలాంటి ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ అందించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..