IPL 2023: ఆర్సీబీ విజయంతో ప్రమాదంలో ముంబై, పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
IPL 2023 Playoff Scenario: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 65వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. RCB విజయంతో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్,రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 65వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌తో బెంగళూరు తన ప్లే ఆఫ్స్ స్థానాన్ని మరింత అనుకూలంగా మార్చుకుంది. ఐపీఎల్‌లో ఆరో సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఈ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్ అందించిన 187 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు టీం 19.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఛేదించింది. మాజీ RCB కెప్టెన్ 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కు 172 పరుగులు జోడించాడు.
SRHపై విజయం సాధించడం ద్వారా, RCB ఇప్పుడు IPL 2023 పాయింట్ల పట్టికలో నం. 4 స్థానానికి చేరుకుంది. 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లను కలిగి ఉంది. దీంతో వరుసగా నాలుగో సీజన్‌లో చివరి నాలుగు స్థానంలో నిలిచేందుకు మరింత చేరువైంది. అయితే, RCB విజయంతో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్,రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్‌లకు చేరే అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.
ఇతర జట్లపై RCB ప్రభావం..
చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో సీఎస్‌కే 2వ స్థానంలో ఉంది. శనివారం (మే 20) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడిస్తే.. ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఓడిపోతే మాత్రం, LSG, RCB, MI టీంలు తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే, CSK నాకౌట్ అవుతుంది. LSG, RCB, MI ప్లేఆఫ్‌లకు చేరుకుంటాయి. అయితే LSG, RCB లేదా MIలో ఎవరైనా ఓడిపోతే CSK ముందుకు వెళ్తుంది.
లక్నో సూపర్ జెయింట్స్: LSG టీం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం కూడా CSK లాగానే ఉంటుంది. శనివారం (మే 20) జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌పై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడం ఖాయంగా నిలుస్తుంది. అలా కాకుండా ఓడిపోతే CSK, MI, RCB చివరి లీగ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. LSG ఓడిపోయి, ఈ మూడు జట్లూ గెలిస్తే, LSG నాకౌట్ అవుతుంది. అయితే LSG ఓడిపోయినా, అలాగే ఈ మూడు టీంలలో ఒకటి ఓడిపోతే, LSG మైనస్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ముందుకు సాగుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆదివారం (మే 21) జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గుజరాత్‌ను ఓడిస్తే.. చివరి నాలుగుకు చేరుకుంటుంది. RCB తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే CSK , LSG తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే టాప్-2లో నిలుస్తుంది. RCB ఓడిపోయి MI గెలిస్తే, RCB నాకౌట్ అవుతుంది. MI ఓడిపోయి, RCB కూడా ఓడిపోతే MIతోపాటు ఇతర జట్లను నెట్ రన్ రేట్‌తో ఆధారపడి ఉంటుంది.
ముంబై ఇండియన్స్: MI అర్హత RCBతో సమానంగా ఉంటుంది. ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది. అయితే అందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. MI ఆదివారం SRHని ఓడించి, CSK, LSG, RCB తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోతే, MI రెండవ స్థానంలో నిలుస్తుంది. కానీ, ఈ మూడు జట్లలో ఏదైనా గెలిస్తే, MI మొదటి రెండు స్థానాల్లో నిలచే అర్హత పోయినట్లే. అలాగే ఈ మూడు జట్లు గెలిస్తే, అది కూడా భారీ తేడాతో గెలిస్తేనే MI తప్పుకుంటుంది. RCB మాత్రమే స్వల్ప విజయాన్ని సాధించి, నెట్ రన్ రేట్‌లో ముందంజంలో నిలవగలదు. MI ఓడిపోతే, RCB, KKR కూడా తమ చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోతే ప్లే ఆఫ్స్ చేరగలదు. అలాగే RR-PBKS మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని లేదా PBKS గెలుస్తుందని ఆశించాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్: RR నెట్ రన్ రేట్ +0.140గా నిలిచింది. శుక్రవారం (మే 19) జరిగే తమ చివరి మ్యాచ్‌లో PBKSని చాలా పెద్ద తేడాతో ఓడించి, RCB, MI, KKR తమ చివరి లీగ్ మ్యాచ్‌లను పెద్ద తేడాతో ఓడిపోతే ఎలిమినేటర్ క్లాష్‌కు అర్హత సాధిస్తారు. అలాంటప్పుడు, వాటితో పోల్చితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా RR ముందుకు వెళ్తుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్: శనివారం (మే 20) జరిగే మ్యాచ్‌లో LSGని భారీ తేడాతో ఓడించి RCB, MI తమ చివరి గేమ్‌లో ఓడిపోతే KKR నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో KKR, MI, RCB మూడింటికి 14 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ అమలులోకి వస్తుంది. అలాగే, దానితో పాటు, RR-PBKS మ్యాచ్ వాష్ అవుట్ అవుతుందని లేదా PBKS గెలుస్తుందని వారు ఆశించాల్సి ఉంటుంది.
పంజాబ్ కింగ్స్: PBKS నెట్ రన్ రేట్ -0.308గా నిలిచింది. దీంతో పంజాబ్ అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. PBKS ముందుకు వెళ్లాలంటే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చాలా పెద్ద తేడాతో ఓడించాలి. అదే సమయంలో, RCB, MI, KKR కూడా తమ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో భారీ ఓటములను చవిచూడాలని ఆశించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే PBKSకు అవకాశం ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..