IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23న.. ఎక్కడంటే?

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కోసం వేలం డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2023 Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23న.. ఎక్కడంటే?
Ipl 2023
Follow us
Venkata Chari

|

Updated on: Nov 09, 2022 | 7:34 PM

టీం ఇండియాతో సహా మిగిలిన జట్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడుతున్నాయి. అదే సమయంలో మినీ వేలానికి ముందే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసే పనిలో ఐపీఎల్ జట్లు బిజీగా ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, IPL 2023 వేలం డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్ తర్వాత దాని అధికారిక నిర్ధారణ చేయనున్నారు.

IPL 2023 వేలం డిసెంబర్ 23న..

స్పోర్ట్స్ స్టార్ ప్రకారం, IPL 2023 వేలం డిసెంబర్ 23 న కొచ్చిలో జరుగుతుంది. అదే సమయంలో ఈ గ్రాండ్ లీగ్ మార్చి చివరి వారం నుంచి ప్రారంభమవుతుంది. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు.

ఐపీఎల్ ఈ వేలం కోసం, అన్ని ఫ్రాంచైజీల పర్స్ కూడా పెంచనున్నారు. అన్ని టీమ్‌ల మొత్తం బడ్జెట్‌ను రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు పెంచవచ్చని తెలుస్తోంది. అంతకుముందు ఫిబ్రవరి నెలలో, IPL కోసం మెగా వేలం జరిగింది. ఆ సమయంలో అన్ని జట్లు మొత్తం 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

ఇవి కూడా చదవండి

ధోని ఆఖరి ఐపీఎల్?

IPL 2023 చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇందుకుగల కారణం టీమిండియా బెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించే. చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరిసారిగా ఐపీఎల్‌లో ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడని తెలుస్తోంది. అయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోని చివరిసారిగా మైదానంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏ జట్టులో ఎంత డబ్బు ఉందంటే..

పంజాబ్ కింగ్స్: రూ. 3.45 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్: 0

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 1.55 కోట్లు

రాజస్థాన్ రాయల్స్: రూ. 95 లక్షలు

కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 45 లక్షలు

చెన్నై సూపర్ కింగ్స్: రూ. 2.95 కోట్లు

గుజరాత్ టైటాన్స్: రూ. 15 లక్షలు

ముంబై ఇండియన్స్: రూ. 10 లక్షలు

సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 10 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 10 లక్షలు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..