GT vs CSK, IPL 2023 Final: ఎంఎస్ ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వర్తించదు.. సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్..

MS Dhoni Retirement: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఎంఎస్ ధోనీకి వర్తించదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడుతున్నాడని తెలిపాడు.

GT vs CSK, IPL 2023 Final: ఎంఎస్ ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వర్తించదు.. సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్..
Ms Dhoni Retirement
Follow us

|

Updated on: May 29, 2023 | 4:16 PM

ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2023 చివరిది అని నమ్ముతున్నారు. ధోనీ ఇప్పటికే సమాధానం ఇచ్చాడు. ఇంకా 8-9 నెలల సమయం ఉందంటూ చెప్పుకొచ్చాడు. కానీ, అతని వయస్సు, అతని ఫిట్‌నెస్ చూస్తుంటే, బహుశా ఈ సీజన్ తర్వాత అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతలో, భారత మాజీ వెటరన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని గురించి కీలక విషయం వెల్లడించాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ నియమం చాలా మంది ఆటగాళ్లకు వారి కెరీర్‌ను పొడిగించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్, రోహిత్ శర్మ కూడా ఈ నియమాన్ని ఉపయోగించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ నియమాన్ని ఇంకా ఉపయోగించలేదు. అదే సమయంలో, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ధోనీని మరికొన్ని సంవత్సరాలు ఆడటానికి సహాయపడుతుందని చెన్నై కోచ్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ విభేదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనీకి వర్తించదు..

ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ధోనీకి వర్తించదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. క్రిక్‌బజ్ ప్రకారం, మీరు ఫిట్‌గా ఉంటే 40కి మించి ఆడటం కష్టం కాదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. చివరి రెండు ఓవర్లలో మాత్రమే బరిలోకి దిగే ఛాన్స్ వస్తోంది. ఈ సీజన్‌లో ధోనీ 40-50 బంతులు కూడా ఎదుర్కోలేదు. కెప్టెన్సీ కారణంగా ఆడుతున్నందున ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ధోనీకి వర్తించదు.

కెప్టెన్సీ కారణంగానే ధోనీ మైదానంలో..

కెప్టెన్సీ కారణంగానే ధోనీ ఫీల్డింగ్‌లో కొనసాగుతున్నాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వారి కోసం అయితే, ఫీల్డింగ్‌కు బదులుగా, బ్యాటింగ్ చేయాలనుకుంటున్నారు. అయితే బౌలర్‌కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ధోనీ 20 ఓవర్లు ఫీల్డింగ్ చేశాడని భారత మాజీ వెటరన్ తెలిపాడు. ధోనీ కెప్టెన్ కాకపోతే, అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఆడలేడు. అప్పుడు అభిమానులు తనను క్రికెట్‌కు మెంటార్‌గా లేదా కోచ్‌గా లేదా డైరెక్టర్‌గా చూడగలరని సెహ్వాగ్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..