IPL 2023: రికార్డులే.. రికార్డులు.. ఫైనల్‌ మ్యాచ్‌లో దుమ్మురేపనున్న ఏడుగురు ప్లేయర్లు.. అవేంటంటే?

IPL 2023: ఐపీఎల్ 16వ ఎడిషన్ ఫైనల్ పోరు కోసం ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ సిద్ధమయ్యాయి. 5వ టైటిల్ పై చెన్నై కన్నేసింది. వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో గుజరాత్ జట్టు రంగంలోకి దిగనుంది.

IPL 2023: రికార్డులే.. రికార్డులు.. ఫైనల్‌ మ్యాచ్‌లో దుమ్మురేపనున్న ఏడుగురు ప్లేయర్లు.. అవేంటంటే?
Csk Vs Gt
Follow us

|

Updated on: May 28, 2023 | 6:35 PM

ఐపీఎల్ 16వ ఎడిషన్ టైటిల్ కోసం నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. 5వ టైటిల్ పై చెన్నై కన్నేసింది. వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో గుజరాత్ జట్టు రంగంలోకి దిగనుంది. వీటన్నింటి మధ్య ఈ మ్యాచ్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ రికార్డులను సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతున్నారు. ఈ మ్యాచ్‌లో నమోదయ్యే టాప్ 7 రికార్డుల వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఈరోజు జరిగే ఫైనల్లో చెన్నై కెప్టెన్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే కీలక రికార్డు సృష్టించనున్నాడు. ఈరోజు జరిగే మ్యాచ్ ధోనీకి 250వ ఐపీఎల్ మ్యాచ్ కావడంతోపాటు టోర్నీలో ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే 10 ఐపీఎల్‌ ఫైనల్స్‌ ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు.

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ సంఖ్యను చేరుకోవడానికి మరో రెండు వికెట్లు కావాలి.

ఇవి కూడా చదవండి

స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ తరుపున 50 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. ఒక సీజన్‌లో 900 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా గిల్ (851) కూడా 49 పరుగులు చేయాల్సి ఉంది.

అనుభవజ్ఞుడైన పేసర్‌ మహ్మద్‌ షమీ గుజరాత్‌ తరుపున 50 వికెట్లు పూర్తి చేసుకునే దశలో ఉన్నాడు. దీని కోసం కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి.

సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదేందుకు రెండు అడుగులు దూరంలో ఉన్నాడు. జడేజా 225 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు కొట్టాడు.

మోహిత్ శర్మకు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగలిగితే, అతను టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేస్తాడు.

టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేయడానికి చెన్నై పేసర్ దీపక్ చాహర్‌కు కేవలం ఒక వికెట్ మాత్రమే అవసరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..