IPL 2022 Retention Players List: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్లు వీరే? కేఎల్ రాహుల్‌కు షాకిచ్చిన పంజాబ్.. పూర్తి జాబితా ఇదిగో..!

IPL 2022 Retention: ఐపీఎల్‌లోని 8 జట్లు కొత్త సీజన్ కోసం తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోనున్నాయి. IPL 2022 మెగా వేలానికి ముందు, ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది.

IPL 2022 Retention Players List: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్లు వీరే? కేఎల్ రాహుల్‌కు షాకిచ్చిన పంజాబ్.. పూర్తి జాబితా ఇదిగో..!
IPL 2022 Retention Players List
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2021 | 10:42 PM

IPL 2022 Retention Players List: ఐపీఎల్‌లోని 8 జట్లు కొత్త సీజన్ కోసం తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోనున్నాయి. IPL 2022 మెగా వేలానికి ముందు, ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. అయితే, ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోలో నివేదిక మేరకు ఐపీఎల్ రిటెన్షన్‌కు ముందే ఓ జాబితా సిద్ధం అయింది. ఈ జాబితాలోని ప్లేయర్లని ఆయా జట్లు రిటైన్ చేసుకోనున్నాయని తెలుస్తోంది. ధోనీ, కోహ్లీ, విలియమ్సన్ వంటి స్టార్ ఆటగాళ్లను తమతోనే ఉంచుకునేందుకు ఆయా ఫ్రాంఛైజీలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో పంజాబ్ జట్టు నుంచి కేఎల్ రాహుల్ నిష్క్రమించాడు. మయాంక్ అగర్వాల్, యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ విశ్వాసం ఉంచింది. ఇద్దరు ఆటగాళ్లను ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లి, మాక్స్‌వెల్‌తో పాటు మహ్మద్ సిరాజ్‌ను ఉంచుకుంది.

పూర్తి జాబితాను.. చెన్నై సూపర్ కింగ్స్ – రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు) కోల్‌కతా నైట్ రైడర్స్ – ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేష్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు) ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు) పంజాబ్ కింగ్స్ – మయాంక్ అగర్వాల్ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ (రూ.15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ – రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (7.5 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.5 కోట్లు) రాజస్థాన్ రాయల్స్ – సంజు శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు)

IPL 2022 కోసం రిటెన్షన్ ప్రక్రియ.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రిటెన్షన్ ప్రక్రియకు ఈరోజు చివరి రోజు. ఈరోజు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే బీసీసీఐకి సమర్పించాయి. ఐపీఎల్ 2022కి ముందు మెగా వేలం జరగనుంది. ఈసారి రెండు కొత్త జట్లు కూడా చేరనున్నాయి. ఒక్కో జట్టు మొత్తం 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 42 కోట్లుగా ఉండాలని బీసీసీఐ పేర్కొంది.

వేలంలో ఒక జట్టు పర్స్ రూ. 90 కోట్లుగా ఉండనుంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు ఈరోజు రిటైన్ చేసుకునేందుకు 4 మంది ఆటగాళ్ల పేర్లను సమర్పించాలి. అదే సమయంలో, రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ డిసెంబర్ 1 నుంచి 25 వరకు ఒక్కొక్కరు ముగ్గురు ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

Also Read: IPL 2022 Retention: రి’టెన్షన్’‌లో పలు ఫ్రాంఛైజీలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వీడ్కోలు పలికిన కీలక ఆటగాడు?

IPL Retention: రిటెన్షన్‌కు ముందే బిగ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!