IPL 2022 Retention: కోహ్లీ, ధోనిల కంటే రిషబ్ పంత్, జడేజా, రోహిత్‌లకే ఎక్కువ ధర.. ఎంతో తెలుసా?
List of IPL 2022 Retained Released Players: IPL 2022 రిటెన్షన్‌లో భాగంగా మొత్తం ఎనిమిది జట్లు 27 మంది ప్లేయర్లను ఆయా జట్లు తమ వద్దే ఉంచుకున్నాయి. ఇందులో నాలుగు జట్లు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి.
List of IPL 2022 Retained Released Players: ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30, మంగళవారం నాడు వెల్లడిస్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్దేశించిన రిటెన్షన్ గడువు మంగళవారంతో ముగిసింది. అయితే ఎవరు ఉన్నారు.. ఎవరు వీడారో మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉంటారా లేదా అనే ఊహాగానాలతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు మళ్లీ ఐపీఎల్ ప్లేయర్ల వేలం పూల్‌లోకి వెళ్లనున్నారు. రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్‌లు చాలా మంది వేలం పూల్‌లోకి వస్తారా లేదా పాత జట్లే ఉంచుకోనున్నాయా అనేది అభిమానులకు ఆసక్తికరంగా మారింది.
CSK : రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు) KKR : ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేష్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు) SRH : కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు) ఎంఐ : రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు) RCB : విరాట్ కోహ్లీ (రూ.15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు) DC : రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.5 కోట్లు) RR : సంజు శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు) PBKS : మయాంక్ అగర్వాల్ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
LIVE Cricket Score & Updates
-
రిలీజైన కీలక ఆటగాళ్లు..
CSK – ఫాఫ్ డు ప్లెసిస్, డ్వేన్ బ్రావో, సురేష్ రైనా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ DC – శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్, కగిసో రబడ, ఆర్ అశ్విన్ MI- హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ SRH – రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే RR – బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, లియామ్ లివింగ్‌స్టోన్ KKR – ఇయాన్ మోర్గాన్, శుభమాన్ గిల్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రాణా PBKS – KL రాహుల్, క్రిస్ గేల్, రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్ RCB – దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్
-
పూర్తి జాబితా..
CSK : రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు) KKR : ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేష్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు) SRH : కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు) MI : రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు) RCB : విరాట్ కోహ్లీ (రూ.15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ.7 కోట్లు) DC : రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.5 కోట్లు) RR : సంజు శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు) PBKS : మయాంక్ అగర్వాల్ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
-
-
రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..
సంజు శాంసన్ రూ. 14 కోట్లు జోస్ బట్లర్ రూ. 10 కోట్లు యశస్వి జైస్వాల్ రూ. 4 కోట్లు
కే సంగక్కర: జోఫ్రా గాయం కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే ముగ్గురు ప్లేయర్లను మా వద్ద ఉంచుకోవాలని నిర్ణయించాం.
.@rajasthanroyals fans, what do you make of the retention list? ?#VIVOIPLRetention pic.twitter.com/JgrLm09mkv
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
కోల్‌కతా రిటెన్షన్ ప్లేయర్ల జాబితా..
ఆండ్రీ రస్సెల్ రూ. 12 కోట్లు వరుణ్ చక్రవర్తి రూ. 8 కోట్లు వెంకటేష్ అయ్యర్ రూ. 8 కోట్లు సునీల్ నరైన్ రూ. 6 కోట్లు
KKR : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.
Here’s @KKRiders‘s #VIVOIPL retention list ?#VIVOIPLRetention pic.twitter.com/mc4CKiwxZL
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ ప్లేయర్లు..
రిషబ్ పంత్ రూ. 16 కోట్లు అక్షర్ పటేల్ రూ. 9 కోట్లు పృథ్వీ షా రూ. 7.5 కోట్లు అన్రిచ్ నార్ట్జే రూ. 6.5 కోట్లు DC : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.
పార్త్ జిందాల్, యజమాని: ఒక జట్టును నిర్మించడం, వారిని తీర్చిదిద్దడం, తరువాత వారిని కోల్పోవడం చాలా చెడ్డ విషయం. కానీ, తప్పదు. అయితే మా అవుట్‌గోయింగ్ ఆటగాళ్లకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా వద్ద ఉన్న డబ్బుతో వీలైనంతమంది ఎక్కువ మంది ఆటగాళ్లను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.
How is that for a retention list, @delhicapitals fans❓#VIVOIPLRetention pic.twitter.com/x9dzaWRaCR
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
-
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లేవరంటే..
రవీంద్ర జడేజా రూ. 16 కోట్లు ఎంఎస్ ధోని రూ. 12 కోట్లు మొయిన్ అలీ రూ. 8 కోట్లు రుతురాజ్ గైక్వాడ్ రూ. 6 కోట్లు
CSK : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.
రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ ముగ్గురిని భర్తీ చేయడం కష్టమని, అందుకే వారిని రిటైన్ చేశామని ఎల్ బాలాజీ తెలిపారు. ఫాఫ్, రాయుడు, బ్రావో లాంటి వాళ్లను వదిలేయడం చాలా కష్టంగా ఉందని తెలిపారు.
The @ChennaiIPL retention list is out! ?
Take a look! ?#VIVOIPLRetention pic.twitter.com/3uyOJeabb6
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
సన్‌రైజర్స్ రిటెన్షన్ చేసింది వీరినే..
కేన్ విలియమ్సన్ రూ.14 కోట్లు అబ్దుల్ సమద్ రూ. 4 కోట్లు ఉమ్రాన్ మాలిక్ రూ. 4 కోట్లు
SRH : ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేశారు. రూ. 68 కోట్లతో మెగా వేలానికి వెళ్లారు.
Take a look at the @SunRisers retention list ?#VIVOIPLRetention pic.twitter.com/fXv62OyAkA
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
పంజాబ్ కింగ్స్ తరుపున ఇద్దరే..
మయాంక్ అగర్వాల్ రూ. 12 కోట్లు అర్ష్‌దీప్ సింగ్ రూ. 4 కోట్లు
PBKS : ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 72 కోట్లతో మెగా వేలానికి వెళ్లనున్నారు.
అనిల్ కుంబ్లే : మేం రాహుల్‌ని ఉంచాలనుకున్నాం. కానీ రాహుల్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తాం.
Here’s the @PunjabKingsIPL retention list ?#VIVOIPLRetention pic.twitter.com/ABl5TWLFhG
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
ముంబై ఖాతాలో మిగిలింది రూ. 48 కోట్లు..
MI : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.
రోహిత్ శర్మ: ఈ ఏడాది ముంబైకి ఇది కష్టతరమైన రిటెన్షన్. మేము ఖచ్చితంగా నలుగురు ప్లేయర్‌లను కలిగి ఉన్నాం. మిగతా వారిని ఆక్షన్‌కు పంపడం హృదయ విదారకంగానే ఉంది. వారు ఈ ఫ్రాంచైజీ కోసం కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
-
ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..
రోహిత్ శర్మ రూ. 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా రూ. 12 కోట్లు కీరన్ పొలార్డ్ రూ. 6 కోట్లు సూర్యకుమార్ యాదవ్ రూ. 8 కోట్లు
The @mipaltan retention list is out!
Comment below and let us know what do you make of it❓#VIVOIPLRetention pic.twitter.com/rzAx6Myw3B
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
ఆర్సీబీ ఖాతాలో మిగిలింది రూ. 57 కోట్లు..
RCB : ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో రూ. 57 కోట్లతో సిద్ధంగా ఉన్నారు.
విరాట్ కోహ్లీ: ఆర్‌సీబీతో ప్రయాణం కొనసాగుతోంది. నన్ను సంప్రదించినప్పుడు, నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ ఫ్రాంచైజీతో మరో మూడేళ్లు ఉండడం నాకు చాలా ఇష్టం. అయితే ట్రోఫీ రాలేదనేది వాస్తవం. తదుపరి సీజన్ నుంచి అదే హోప్‌తో బరిలోకి దిగుతాం. మేము మీ అందరినీ ఈసారి గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాం. మా అభిమానుల సంఖ్య అద్భుతంగా ఉంది. మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం.
-
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ ప్లేయర్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.
విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు గ్లెన్ మాక్స్‌వెల్ రూ. 11 కోట్లు మహ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు
Welcome to #VIVOIPLRetention @RCBTweets have zeroed down on the retention list ?
What do you make of it? ?#VIVOIPL pic.twitter.com/77AzHSVPH5
— IndianPremierLeague (@IPL) November 30, 2021
-
తొలి రిటెన్షన్ రాజస్థాన్ నుంచే..!
First retention of the night. ? pic.twitter.com/Lc3fII2yqX
— Rajasthan Royals (@rajasthanroyals) November 30, 2021
-
కగిసో రబాడను దూరంగా ఉంచిన ఢిల్లీ..!
ఎన్రిక్ నార్కియా గత రెండు సీజన్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బాగా రాణించినప్పటికీ, కగిసో రబాడ వంటి బౌలర్‌ను నిలబెట్టుకోకపోవడం కీలక నిర్ణయమని చెప్పడంలో సందేహం లేదు.
-
కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోకపోవడం లాభిస్తుందా?
నివేదికల ప్రకారం, పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేయకపోతే, ఆ టీంకు ప్రయోజనం ఉంటుందా? లక్నో ఫ్రాంచైజీ రూ.20 కోట్లతో రాహుల్‌ను సొంతం చేసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
-
వీరిని వద్దనుకున్న కారణాలేంటో?
పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం రషీద్ ఖాన్‌ను ఎందుకు రిటైన్ చేసుకోలేదో మాత్రం కారణాలు తెలియదు. పొట్టి ఫార్మెట్‌లో వీరిని మించిన ప్లేయర్లను ఈ టీంలు కచ్చితంగా పొందలేవు.
-
ఫ్రాంఛైజీల వద్ద మిగిలిన డబ్బు.. వేలానికి ఎంత మనీతో వెళ్లనున్నాయంటే?
ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ఫో ప్రకారం విడుదల చేసిన జాబితాలో సీఎస్‌కే, కేకేఆర్, డీసీ, ముంబై టీంలు నలుగురు చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీంతో ఈ ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొనేందుకు రూ 48 కోట్లు మాత్రమే మిగిలియాయి. వీటితోనే మిగతా ప్లేయర్లను రిటైన్ చేసుకునాల్సి ఉంది. CSK : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి. KKR : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి. DC : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి. SRH : ముగ్గురు ఆటగాళ్లను నిలబెట్టుకున్నారు. రూ. 68 కోట్లు మిగిలాయి MI : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి. RCB : ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నారు. రూ. 57 కోట్లు మిగిలాయి. RR : ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. రూ. 62 కోట్లు మిగిలాయి. PBKS : ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. రూ. 72 కోట్లు మిగిలాయి.
-
ఎవరు ఎవరితో ఉండనున్నారు?
ఇప్పటివరకు ధృవీకరించబడిన జాబితా? CSK : రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ KKR : సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ SRH : కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ MI : రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ RCB : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ DC : రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే RR : సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ PBKS : మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్
-
ఎస్‌ఆర్‌హెచ్‌కు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో గుడ్ బై
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో గుడ్ బై చెప్పారు. అభిమానులకు ధన్యవాదాలంటూ వీడ్కోలు తెలిపారు.
View this post on Instagram -
ఈ నలుగురు ఆటగాళ్లు చెన్నైతోనే..
చెన్నై సూపర్ కింగ్స్ ఏ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేస్తుందో ఇప్పటికే తేలిపోయింది. ధోనీ, జడేజా, రీతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ జట్టులో కొనసాగనున్నారు.
-
కెప్టెన్ మోర్గాన్‌కు వీడ్కోలు పలికిన కోల్‌కతా!
కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌తో IPL 2022లో అడుగుపెట్టబోతోంది. నివేదికలను విశ్వసిస్తే, ఫ్రాంచైజీ ఇయాన్ మోర్గాన్‌ను నిలుపుకోవడం లేదు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌లను టీమ్ రిటైన్ చేయబోతోంది.
-
రాజస్థాన్ రాయల్స్ కూడా షాకింగ్ నిర్ణయం!
రాజస్థాన్ రాయల్స్ కూడా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. ఇందులో సంజూ శాంసన్‌తో పాటు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. జైస్వాల్ అన్ క్యాప్డ్ ప్లేయర్. అదే సమయంలో, ఫ్రాంచైజీ జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్‌లను విడుదల చేయబోతోంది.
-
ఎస్‌ఆర్‌హెచ్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను రిటైన్ చేస్తుంది!
నివేదికల ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేయబోతోంది. జమ్మూకశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్‌లు జట్టులో కొనసాగనున్నారు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో కూడా మెగా వేలానికి వెళ్లనున్నారు.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రషీద్ ఖాన్ ఔట్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్‌ను నిలబెట్టుకోవడం లేదు. మీడియా నివేదికల ప్రకారం, రషీద్ ఖాన్ నంబర్ 1 స్థానంలో నిలవాలనుకున్నాడు. అయితే ఫ్రాంచైజీ కేన్ విలియమ్సన్‌ను ఎంచుకుంది.
-
యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేయరంట..!
తాజా వార్తల ప్రకారం, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను RCB ఉంచుకోవడం లేదని తెలుస్తోంది. యుజ్వేంద్ర స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను కొనసాగించనున్నారు. నివేదికల ప్రకారం, RCB విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను జట్టులో ఉంచుకోబోతోంది.
-
ముంబై ఇండియన్స్ ఎవరిని నిలబెట్టుకుంటుంది?
రిటెన్షన్ ప్రకటనకు ముందు, ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులో కొనసాగించేందుకే ముంబై మొగ్గుచూపనుంది. దీంతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను రిటైన్ చేయనున్నారు.
Published On - Nov 30,2021 8:30 PM