IPL Retention: రిటెన్షన్‌కు ముందే బిగ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
ఐపీఎల్ 2022 కోసం ఏ జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తుందనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే అంతకంటే ముందు చాలా షాకింగ్ న్యూస్‌లు బయటకు వస్తున్నాయి.
IPL Retention: IPL 2022 మెగా వేలానికి ముందు, ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. అయితే రిటెన్షన్ ప్రకటన వెలువడకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ శిబిరం నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయి.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్‌లను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా ఇద్దరు ఆటగాళ్లు IPL 2021 ఆడలేకపోయారు. దీని ఫలితంగా ఫ్రాంచైజీకి చాలా నష్టం జరిగింది.
రషీద్ ఖాన్‌ను రిటైన్ చేయకూడదని సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయించింది. దీంతో వచ్చే ఏడాది రషీద్ ఖాన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్‌కు రిటైన్‌లో నంబర్ వన్‌గా ఉండాలని రషీద్ ఖాన్ కోరుకున్నాడు. కానీ సన్‌రైజర్స్ అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌ను నంబర్ వన్‌గా ఎంచుకుంది.
నివేదికల ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్‌ను కూడా ఉంచుకోబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. ఇందులో మయాంక్ అగర్వాల్, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పేర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌ని విడుదల చేస్తున్న పంజాబ్ కింగ్స్ పేర్కొంది. దీంతో ఈ సారి మెగా ఆక్షన్ చాలా ఉత్కంఠబరితంగా సాగనుంది.
View this post on Instagram
Also Read: 83 Trailer: 83 ట్రైలర్‌లో సచిన్ టెండూల్కర్.. క్లారిటీ ఇచ్చిన టీం యూనిట్.. ఎక్కడున్నాడంటే?
IND VS SA: భారత ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా హామీ.. పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?