IPL 2022: అతను వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. అందుకే అతడిని రిటైన్ చేసుకోలేదు..
ఐపీఎల్-2022కు సంబంధించి రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ పాలక మండలికి అందించారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి...
ఐపీఎల్-2022కు సంబంధించి రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ పాలక మండలికి అందించారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోలేదు. కేవలం ఇద్దరిని మాత్రమే తిరిగి తీసుకుంది. మయాంక్ అగర్వాల్‌ను రూ. 12 కోట్లకు, అన్‌క్యాప్‌డ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్‌ను తిరిగి తీసుకోకపోడాన్ని క్రీడా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే దీనిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించారు. ఐపీఎల్- 2022కి ముందు వేలం పూల్‌లోకి ప్రవేశించాలనే రాహుల్ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. అందుకే అతన్ని తిరిగి తీసుకోలేదని వివరించారు.
“మాకు ప్రధాన ఆటగాడు రాహుల్. సహజంగానే మేము అతనిని కొనసాగించాలనుకున్నాము. 2 సంవత్సరాల క్రితం మేము అతనిని కెప్టెన్‌గా ఎంచుకోవడానికి ఇది ఒక కారణం. అతను జట్టుకు ప్రధాన వ్యక్తి కావచ్చు. కానీ అతను వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మేము ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాము. ఇది ఆటగాళ్ల ప్రత్యేకాధికారం” అని అనిల్ కుంబ్లే అన్నాడు. రాహుల్ IPLలో నిలకడగా రాణిస్తున్నాడు. IPL గత నాలుగు సీజన్లలో మూడింటిలో 600 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అయితే బ్యాట్‌తో అదరగొట్టినా మిగిలిన జట్టు విఫలమవడంతో రాహుల్ PBKSని ప్లే-ఆఫ్‌కు నడిపించలేకపోయాడు.
అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు డిసెంబరు 25 వరకు తమ ముగ్గురు ఆటగాళ్లును ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. KL రాహుల్‌ని రెండు కొత్త జట్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. రాహుల్‌ని రెండు కొత్త జట్లు ఎంపిక చేసుకోకపోతే అతను మెగా వేలానికి వెళ్తాడు.
Read Also… Dinesh Karthik: ముంబై టెస్ట్ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..