Dinesh Karthik: ముంబై టెస్ట్ తుది జట్టు నుంచి అతడిని తప్పించాలి.. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది..
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. దీంతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం ప్రమాదంలో పడిందని వార్తలు వస్తున్నాయి...
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. దీంతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం ప్రమాదంలో పడిందని వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది తన పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న రహానె కాన్పూర్‌లో జరిగిన టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రహానే 2021లో సగటు 19.6తో ఉన్నాడు. అయితే ముంబై టెస్ట్‌లో రహానెను జట్టు నుంచి తొలగించటంతో అతనిపై ఒత్తిడిని తగ్గిస్తుందని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అన్నారు.
“శ్రేయాస్ అయ్యర్ రాణిస్తుండటంతో రహానెపై ఒత్తిడి ఉంటుందని నేను భావిస్తున్నాను. అతనిని తొలగించవచ్చు. రహానే ఆటకు దూరమైతే ఎలాంటి హాని ఉండదు” అని క్రిక్‌బజ్‌తో జరిగిన చర్చలో కార్తీక్ చెప్పాడు. “అయ్యర్ ఈ టెస్టులో భారత్‌ను సేఫ్ జోన్‌కి తీసుకెళ్లాడు. అతను చాలా బాగా ఆడాడు. అతన్ని తొలగించడం తప్పుగా అనుకోవద్దు. అది అతనిపై కొంత ఒత్తిడిని తగ్గిస్తుంది. అని దినేష్ అన్నాడు.
” పుజారాపై కూడా ఇదే విధమైన ఒత్తిడి ఉందని నేను అనుకుంటున్నాను. చాలా కాలంగా అతను సెంచరీ చేయలేదు. 2020 ప్రారంభం నుండి అతను 20 సగటుతో ఉన్నాడు. అంచనాలకు అనుగుణంగా రాణించలేదని వీరిద్దరు తెలుసు.” అని కార్తీక్ వివరించాడు.
Read Also.. Shardul Thakur: శార్దూల్ ఠాకూర్‌ను దక్షిణాఫ్రికాకు పంపకూడదని BCCI నిర్ణయం.. ఎందుకంటే..