AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Mega Auction: భారత ఆల్‌రౌండర్‌కు భారీ షాక్ తగలనుందా.. విండీస్ సిరీస్‌ నుంచి ఔట్.. ఐపీఎల్‌ 2022లోనూ తక్కువ ధరకే?

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీని కారణంగా టీమిండియా నుంచి తొలగించారు. ప్రస్తుతం హార్దిక్ తిరిగి వస్తాడనే ఆశ మరింత సన్నగిల్లుతోంది.

IPL 2022 Mega Auction: భారత ఆల్‌రౌండర్‌కు భారీ షాక్ తగలనుందా.. విండీస్ సిరీస్‌ నుంచి ఔట్.. ఐపీఎల్‌ 2022లోనూ తక్కువ ధరకే?
Pandya
Venkata Chari
|

Updated on: Dec 20, 2021 | 9:01 PM

Share

IPL 2022 Mega Auction: హార్దిక్ పాండ్యా.. ఒకప్పుడు తదుపరి కపిల్ దేవ్ అని పేరుగాంచాడు. బంతితో, బ్యాటింగ్‌తో, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌‌గా మారాడు. కానీ, ఒక్కసారిగా గాయం కారణంగా ఈ ఆటగాడి కెరీర్‌కు గ్రహణం పట్టింది. వెన్ను గాయం కారణంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేడు. అయినప్పటికీ అతనికి టీ20 ప్రపంచ కప్‌లో అవకాశం ఇచ్చారు. పాండ్యా గాయం కారణంగా అతని బౌలింగ్ స్థాయి పడిపోయింది. దాంతో టీమ్ ఇండియా చాలా నష్టపోయింది. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌ అయిన వెంటనే హార్దిక్‌ పాండ్యా తొలిసారిగా జట్టుకు దూరమై ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాలని కోరుకున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గురించి పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లలో కూడా పాండ్యా ఆడలేడు.

ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ ఫిట్‌నెస్‌ కోసం జనవరి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పని చేస్తున్నాడు. అతని బౌలింగ్ సరిగ్గా లేకపోతే, అతని పునరాగమనం అసాధ్యం. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్ జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయడం అసాధ్యం. ఫిట్‌నెస్ కోల్పోవడంతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో కూడా హార్దిక్ పాండ్యాకు ఎదురుదెబ్బలు తగిలే ఛాన్స్‌ ఉంది.

ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యాకు భారీ షాక్..! ఐపీఎల్ వేలంలో హార్దిక్ పాండ్యా పేలవమైన బౌలింగ్ ఫిట్‌నెస్‌ను కోల్పోవడం ఖాయం. ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబైలోని పునరావాస కేంద్రంలో ఉన్నాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు జట్లు అతనికి అధిక ధర చెల్లించడానికి సిద్ధంగా మాత్రం లేవనే టాక్ నడుస్తోంది.

హార్దిక్ పాండ్యా 2015 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఆ సమయంలో పాండ్యా జీతం రూ. 10 లక్షలు మాత్రమే. కానీ, అతని ప్రదర్శన ఆధారంగా కేవలం 3 సంవత్సరాలలో సంవత్సరానికి రూ. 11 కోట్ల రూపాయలను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో పాండ్యా 1476 పరుగులు చేశాడు. ఈ పరుగులు 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వచ్చాయి. అయితే ప్రస్తుతం కాలం మారింది. భవిష్యత్తులో పాండ్యా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ ఆటగాడు ఎలా పునరాగమనం చేస్తాడో చూడాలి.

Also Read: Pakistan Cricket Team: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్‌ స్పిన్నర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..!

Ashes Records: యాషెస్ సిరీస్‌లో అత్యధిక సెంచరీల రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?