Ashes Records: యాషెస్ సిరీస్‌లో అత్యధిక సెంచరీల రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?

ENG vs AUS, Ashes series: 140 ఏళ్లుగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ నిలిచాడు.

Ashes Records: యాషెస్ సిరీస్‌లో అత్యధిక సెంచరీల రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?
Eng Vs Aus, Ashes Series
Follow us
Venkata Chari

|

Updated on: Dec 20, 2021 | 7:13 PM

Ashes Records: 140 ఏళ్లుగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ యాషెస్ మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరు మీద ఉన్నాయి. బ్రాడ్‌మాన్ యాషెస్‌లో 19 సెంచరీలు సాధించాడు. బ్రాడ్‌మన్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా 10కి పైగా సెంచరీలు సాధించారు. వీరిలో ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు.

సర్ డాన్ బ్రాడ్‌మాన్: ఈ లెజెండరీ క్రికెట్ ప్లేయర్ 1928 నుంచి 1948 మధ్య యాషెస్ సిరీస్‌లో 37 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో బ్రాడ్‌మాన్ 89.78 సగటుతో 5028 పరుగులు చేశాడు. యాషెస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా బ్రాడ్‌మాన్ కావడం విశేషం. యాషెస్‌లో బ్రాడ్‌మన్‌కు 19 సెంచరీలు ఉన్నాయి. యాషెస్‌లో పరుగులు, సెంచరీల పరంగా బ్రాడ్‌మన్‌కు చేరువలో ఎవరూ లేరు.

జాక్ హాబ్స్: ఈ ఇంగ్లండ్ ఆటగాడు తన కెరీర్‌లో మొత్తం 15 సెంచరీలు చేశాడు. ఇందులో 12 సెంచరీలు యాషెస్ మ్యాచ్‌ల్లోనే ఉన్నాయి. హాబ్స్ ఆస్ట్రేలియాతో 41 మ్యాచ్‌ల్లో 54 సగటుతో 3636 పరుగులు చేశాడు. 1908 నుంచి 1930 మధ్య యాషెస్‌లో ఆస్ట్రేలియాకు అతిపెద్ద ముప్పుగా మారాడు.

స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు ప్రస్తుత కాలంలో యాషెస్‌లో కీలక ఆటగాడిగా నిలిచాడు. 29 యాషెస్ మ్యాచ్‌ల్లో స్మిత్ 11 సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో 65 సగటుతో 2900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో, అతను యాషెస్ సెంచరీల పరంగా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జాక్ హాబ్స్‌ను అధిగమించే ఛాన్స్ ఉంది.

స్టీవ్ వా: ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ 45 యాషెస్ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు సాధించాడు. వా ఇంగ్లండ్‌పై 59 సగటుతో 3173 పరుగులు చేశాడు.

Also Read: Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్‌లో ‘పెద్దోళ్లు’.. ఎనిమిది సీజన్లుగా రాణిస్తోన్న స్టార్ ప్లేయర్లు వీరే?

IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!