Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్‌లో ‘పెద్దోళ్లు’.. ఎనిమిది సీజన్లుగా రాణిస్తోన్న స్టార్ ప్లేయర్లు వీరే?

ప్రో కబడ్డీ లీగ్‌లోని ఐదుగురు సీనియర్ ఆటగాళ్లలో నలుగురు ఈ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్నారు.

Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్‌లో 'పెద్దోళ్లు'.. ఎనిమిది సీజన్లుగా రాణిస్తోన్న స్టార్ ప్లేయర్లు వీరే?
Pro Kabaddi 2021
Follow us

|

Updated on: Dec 20, 2021 | 7:09 PM

Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో కూడా ధర్మరాజ్ చెర్లతన్ కబడ్డీ కోర్టులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అతడికి ప్రస్తుతం 46 ఏళ్లు. ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌లో అతను అత్యంత వయస్కుడైన ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ఈ జాబితాలో అతనితో పాటు ఏ ఇతర ఆటగాళ్లు ఉన్నారో చూద్దాం..

1. ధర్మరాజ్ చెర్లతన్: జైపూర్ పింక్ పాంథర్స్ ఆటగాడు ధర్మరాజ్ చెర్లతన్, ఇప్పటివరకు మొత్తం ఏడు ప్రో కబడ్డీ సీజన్‌లలో కనిపించాడు. గత 2 దశాబ్దాలుగా కబడ్డీ ఆడుతున్న ధరమ్‌రాజ్‌కు 46 ఏళ్లు. ప్రో కబడ్డీలో ఇప్పటి వరకు 302 పాయింట్లు సాధించాడు. అతను నాలుగో సీజన్ విజేత పాట్నా పైరేట్స్‌లో కూడా భాగమయ్యాడు.

2. జీవ కుమార్: ఈ సీజన్‌లో జీవ కుమార్ దబాంగ్ ఢిల్లీ తరపున ఆడబోతున్నాడు. 40 ఏళ్ల జీవా దేశంలోనే అత్యుత్తమ రైట్ కవర్‌గా పేరుగాంచాడు. సూపర్ ట్యాకిల్ రెండు 2 టైటిళ్లను సాధించిన జట్లలో భాగమయ్యాడు. యూ ముంబాతో మొదటి టైటిల్‌ను, బెంగాల్ వారియర్స్‌తో రెండవ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ప్రో కబడ్డీలో జీవాకు ఇప్పటి వరకు 235 పాయింట్లు సాధించాడు.

3. జోగిందర్ నర్వాల్: జోగిందర్ దబాంగ్ ఢిల్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. అతడికి ప్రస్తుతం 39 ఏళ్లు. జోగిందర్ ఇప్పటివరకు 82 మ్యాచ్‌ల్లో 177 పాయింట్లు సాధించాడు. 2018 సంవత్సరం అతనికి అత్యుత్తమంగా నిలిచింది. ఇందులో అతను 51 ట్యాకిల్ పాయింట్లను గెలుచుకున్నాడు.

4. మంజిత్ చిల్లర్: 35 ఏళ్ల మంజిత్ చిల్లర్ కూడా దబాంగ్ ఢిల్లీ నుంచి బరిలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లు ఆడి 563 పాయింట్లతో నిలిచాడు. మొదటి మూడు సీజన్లలో ప్రతిసారీ 100 కంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. ప్రో కబడ్డీ స్టార్ డిఫెండర్లలో ఒకడిగా పేరుగాంచాడు.

5. అజయ్ ఠాకూర్: ప్రో కబడ్డీ లీగ్‌లో ఈ స్టార్ ఇప్పటివరకు 115 మ్యాచ్‌లు ఆడాడు. 35 ఏళ్ల అజయ్ ప్రొ కబడ్డీలో 811 పాయింట్లతో నిలిచాడు. ఐదవ, ఆరవ సీజన్లలో 200 కంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్‌లో అజయ్ ఢిల్లీ దబాంగ్ తరఫున ఆడనున్నాడు.

Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?

IND vs SA Boxing Day Test: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌పై ఒమిక్రాన్ దెబ్బ.. ప్రేక్షకులు లేకుండానే బాక్సింగ్ డే టెస్ట్..!