COVID-19: అబుదాబి ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో కోవిడ్ కలకలం.. పాజిటివ్‌గా తేలిన టెన్నిస్ స్టార్ ప్లేయర్.. !
Rafael Nadal Tests Positive: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ డిసెంబర్ 20న స్పెయిన్ చేరుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలినట్లు స్వయంగా ప్రకటించాడు.

Rafel Nadal
Rafael Nadal Tests Positive: టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో ఆడిన రాఫెల్ ఇటీవల గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. తనకు కరోనా సోకినట్లు రాఫెల్ నాదల్ స్వయంగా ధృవీకరించాడు.
“నేను కొన్ని బాధాకరమైన క్షణాలను కలిగి ఉన్నాను. దీంట్లో నుంచి మెరుగుపడతానని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నాను. నాతో క్లోజ్‌గా ఉన్నవారంతా దయచేసి టెస్టులు చేయించుకోండి” అని స్పెయిన్ అథ్లెట్ ఒక ప్రకటనలో తెలిపారు.