IND vs SA Boxing Day Test: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌పై ఒమిక్రాన్ దెబ్బ.. ప్రేక్షకులు లేకుండానే బాక్సింగ్ డే టెస్ట్..!

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరగనుంది. అయితే..

IND vs SA Boxing Day Test: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌పై ఒమిక్రాన్ దెబ్బ.. ప్రేక్షకులు లేకుండానే బాక్సింగ్ డే టెస్ట్..!
Ind Vs Sa
Follow us
Venkata Chari

|

Updated on: Dec 20, 2021 | 5:23 PM

IND vs SA Boxing Day Test: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరగనుంది. అయితే సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి టెస్టుకు స్టాండ్‌లు ఖాళీగా ఉండనున్నాయి. ఈమేరకు దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుని ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది.

దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మొదటి టెస్ట్ టిక్కెట్లను విక్రయించకూడదని నిర్ణయించింది. కొత్త కరోనా గైడ్ లైన్ ప్రకారం, ప్రభుత్వం 2000 మందిని ప్రవేశించడానికి అనుమతించింది. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మొదటి టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, అసోసియేషన్, స్థానిక ఆఫీస్ బేరర్లు మాత్రమే స్టేడియంలో ఉండనున్నారు.

రెండో టెస్టుకు కూడా? వాండరర్స్ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న రెండో టెస్టులో ప్రేక్షకుల ప్రవేశంపై ఇంకా స్పష్టత లేదు. టిక్కెట్లు అమ్మకానికి పెట్టలేదు. ప్రేక్షకులకు ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని స్టేడియం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం త్వరలో రానుంది.

దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు టీమ్ ఇండియా ముంబైలో కఠిన క్వారంటైన్‌లో ఉంది. దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు భారత జట్టు 3 రోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉంది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా చేరుకున్న తర్వాత కూడా, భారత జట్టు ఒక రోజు క్వారంటైన్‌లో ఉంది. ఈ సమయంలో భారత ఆటగాళ్లకు 3సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు.

భారత జట్టు శిక్షణ ప్రారంభం.. భారత జట్టు డిసెంబర్ 17న దక్షిణాఫ్రికా చేరుకుంది. ఒక రోజు నిర్బంధంలో ఉన్న తర్వాత, జట్టు శిక్షణ కూడా ప్రారంభించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు శిక్షణ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మ్యాచ్ షెడ్యూల్ తొలిటెస్టు: 26 నుంచి 30 డిసెంబర్, 2021 (సెంచూరియన్) రెండో టెస్టు: 2022 జనవరి 3 నుంచి 7 వరకు (జోహన్నెస్‌బర్గ్) మూడో టెస్టు: 11 నుంచి 15 జనవరి, 2022 (కేప్ టౌన్)

వన్డే సిరీస్.. తొలి వన్డే: జనవరి 19, 2022 పార్ల్ 2వ వన్డే: జనవరి 21, 2022 పార్ల్ 3వ వన్డే: జనవరి 23, 2022 కేప్ టౌన్

Also Read: IND vs SA: ద్రవిడ్ ప్లేస్‌పై కన్నేసిన కోహ్లీ.. రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్న టెస్ట్ సారథి

COVID-19: అబుదాబి ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో కోవిడ్ కలకలం.. పాజిటివ్‌గా తేలిన టెన్నిస్ స్టార్ ప్లేయర్.. !

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!