AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Promo: ఐపీఎల్ ప్రోమో వచ్చేసిందోచ్.. మాస్ లుక్‌లో అదరగొట్టిన తలా

మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే IPL 15వ సీజన్ (IPL 2022) ప్రోమో విడుదల అయింది. ఇందులో ఎంఎస్ ధోని కొత్త లుక్ బాగా ఆకట్టుకుంటోంది.

IPL 2022 Promo: ఐపీఎల్ ప్రోమో వచ్చేసిందోచ్.. మాస్ లుక్‌లో అదరగొట్టిన తలా
Dhoni New Look
Venkata Chari
|

Updated on: Mar 04, 2022 | 2:09 PM

Share

IPL (IPL 2022) వేలంలో ఆటగాళ్లపై కనక వర్షం కురిసింది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్క్వాడ్‌లతో సిద్ధమవడంతో త్వరలోనే ఐపీఎల్ హడావుడి మైదానంలో కనిపించనుంది. ప్రస్తుతం 10 జట్లు మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే IPL (IPL 2022 Promo) 15వ సీజన్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఈసారి లీగ్ నిజంగా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ముంబై, పూణేలోని స్టేడియంలలో IPL జరగనుంది. ప్రేక్షకుల ప్రవేశానికి కూడా ఆమోదం లభించింది. ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు టోర్నీకి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయగా, అందులో ఎప్పటిలాగే ధోనీ లుక్ అదిరిపోయింది. ఈసారి ధోనీ(MS Dhoni) బస్సు డ్రైవర్‌గా మారి సౌత్ ఇండియన్ లుక్‌లో కనిపించాడు. ఈసారి కూడా ఐపీఎల్ ప్రోమో చాలా బాగుంది.

ఐపీఎల్ 2022 ప్రోమోలో ధోనీ బస్సు నడుపుతూ కనిపించాడు. రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా బ్రేకులు వేసి రివర్స్ గేర్ వేసి బస్సును వెనక్కి వెళ్లేలా చేశాడు. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి బస్సుతో పాటు వెనక్కి వెళుతుంది. ఆ సమయంలో ధోనీ బస్సును నడిరోడ్డులో ఆపి డ్రైవింగ్ సీటులోంచి దిగి బస్సు మెట్లపై కూర్చుంటాడు. నిజానికి ఐపీఎల్‌ సూపర్‌ ఓవర్‌ చూసేందుకు ధోనీ ఇదంతా చేస్తాడు. మార్గమధ్యంలో బస్సు ఆగిపోవడం చూసిన ట్రాఫిక్ పోలీస్.. ధోనిని కారణం అడుగుతాడు. దానికి సమాధానం మొత్తం విషయాన్ని వివరిస్తుంది. ధోనీ మాట్లాడుతూ – సూపర్ ఓవర్ జరుగుతోంది. ఇది టాటా ఐపీఎల్, ఇక మామూలుగా ఉండదు’ అంటూ చెప్పుకొస్తాడు.

IPL 2022లో ప్రత్యేకత ఏమిటి? ఈసారి ఐపీఎల్ వేరే ఫార్మాట్‌లో జరగనుంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి గ్రూప్‌లో ఉన్నాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో గ్రూప్‌లో ఉన్నాయి.

కొత్త ఫార్మాట్ ప్రకారం, లీగ్ దశలో, IPL జట్టు 5 ప్రత్యర్థులతో రెండు సార్లు ఆడాల్సి ఉంటుంది. మిగతా గ్రూపులోని 4 టీంలతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ప్లేఆఫ్‌కు జట్లను నిర్ణయిస్తారు.

Also Read: IND vs SL: కోహ్లీ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. ఆ లిస్టులో చేరిన ఆరో భారత బ్యాట్స్‌మెన్స్..

Watch Video: మైదానంలో ముద్దుల వర్షం కురిపించిన విరుష్క జోడీ.. సెంచరీ టెస్ట్ స్పెషల్ ఇదేనంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో