IND vs SL: కోహ్లీ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. ఆ లిస్టులో చేరిన ఆరో భారత బ్యాట్స్‌మెన్..
టెస్టు క్రికెట్‌లో 8000 పరుగులకు చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి 169 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ(Virat Kohli) 100వ టెస్టులో సెంచరీ సాధించాలని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అంతకుముందే 8000 పరుగుల (8000 Run) మైలురాయిని చేరుకుని పెద్ద బహుమతిని అందించాడు. విరాట్ తన 100వ (100th Test) టెస్టులో ఈ ఘనత సాధించాడు. శ్రీలంకతో మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 38వ స్కోరు చేసిన వెంటనే విరాట్ కోహ్లీ ఈ రికార్డును చేరుకున్నాడు. దీంతో గవాస్కర్, సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ వంటి భారత దిగ్గజాల జాబితాలో చేరిపోయాడు. విరాట్ కోహ్లీ 50 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేస్తూనే టెస్ట్ క్రికెట్‌లో 8000 పరుగులను పూర్తి చేశాడు.
టెస్టు క్రికెట్‌లో 8000 పరుగులకు చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఆడాడు. సుదీర్ఘ క్రికెట్ ఫార్మాట్‌లో ఈ మైలురాయిని చేరుకున్న ఆరో భారతీయుడు, ప్రపంచంలోని 29వ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. అదే సమయంలో, అతను ప్రపంచంలోనే అత్యంత వేగంగా 8000 టెస్ట్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, భారతదేశం నుంచి 14వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విరాట్ కంటే నెమ్మదిగా ఈ దశను తాకిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ VVS లక్ష్మణ్ కావడం విశేషం.
100వ టెస్టులో 8000 పరుగుల రికార్డు..
టెస్టు క్రికెట్‌లో 8000 పరుగుల మార్క్‌ను చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీలో ఆత్మవిశ్వాసం పెరిగిందనుకోవాలి. దాని సహాయంతో సెంచరీ నిరీక్షణకు కూడా ముగింపు పలుకుతాడని ఫ్యాన్ భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ నవంబర్ 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన 100వ టెస్టు మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకునే సువర్ణావకాశం అతడికి దక్కింది.
ఈ విషయంలో విరాట్ తొలి భారతీయుడు అవుతాడా?
విరాట్ కోహ్లీ కంటే ముందు 11 మంది ఆటగాళ్లు భారత్ తరఫున 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడారు. వారిలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. కానీ 100వ టెస్టులో ఎవరూ సెంచరీ చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 100వ టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి కూడా నిలిచే అవకాశం ఉంది.
8000 పరుగులు పూర్తి చేసిన భారత్ ఆటగాళ్లు..
154 ఇన్నింగ్సులు సచిన్
157 ద్రవిడ్
160 సెహ్వాగ్
166 గవాస్కర్
169 విరాట్ కోహ్లీ
201 వీవీఎస్ లక్ష్మణ్
Watch Video: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్పెషల్ ‘సెంచరీ’.. సన్మానించిన రాహుల్ ద్రవిడ్