AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: గత ఏడాది రూ. 9.25 కోట్లు.. ఈ ఏడాది రూ. 90 లక్షలు.. ఈ ఆటగాడు ఎవరో గుర్తు పట్టండి..

త సీజన్‌లో రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేయబడింది. గత సీజన్‌లో ఈ ఆటగాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆల్ రౌండర్‌ను భారీ మొత్తాన్ని చెల్లించి తన సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన..

IPL 2022 Auction: గత ఏడాది రూ. 9.25 కోట్లు.. ఈ ఏడాది రూ. 90 లక్షలు.. ఈ ఆటగాడు ఎవరో గుర్తు పట్టండి..
Krishnappa Gowtham
Sanjay Kasula
|

Updated on: Feb 13, 2022 | 5:45 PM

Share

Krishnappa Gowtham, IPL 2022 Auction: గత IPL సీజన్‌లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయిన కృష్ణ గౌతమ్ IPL 2022 వేలంలో పెద్ద నష్టాన్ని చవిచూశాడు . గౌతమ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ కేవలం రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. కృష్ణప్ప గౌతమ్ బేస్ ధర రూ.50 లక్షలు అని మీకు తెలియజేద్దాం. గత సీజన్‌లో గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గౌతమ్. గౌతమ్ (Krishnappa Gowtham Value) గత సీజన్‌లో రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేయబడింది. గత సీజన్‌లో ఈ ఆటగాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆల్ రౌండర్‌ను భారీ మొత్తాన్ని చెల్లించి తన సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన కృష్ణప్ప గౌతమ్‌ ఖాతాలో 13 వికెట్లు చేరాయి. గౌతమ్ 14.30 సగటుతో 186 పరుగులు చేశాడు. గౌతమ్ స్ట్రైక్ రేట్ 170కి చేరువలో ఉంది. గౌతమ్ ఇప్పటి వరకు ఐపీఎల్ మూడు సీజన్లు మాత్రమే ఆడాడు.

 2018లో ఈ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో గౌతమ్ 15 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దీని తర్వాత గౌతమ్ 2019 సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. 2020లో 2 మ్యాచ్‌ల్లో ఒక వికెట్ తీయగలిగాడు. 2021 సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే, గత మూడు సీజన్లలో, గౌతమ్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతను బ్యాటింగ్‌లో పెద్దగా ఆటతీరును ప్రదర్శిచలేకపోయాడు. ఎందుకంటే అతనికి అలాంటి అవకాశాలు రాలేదు.

అప్పుడు రూ. 9 కోట్లకుపైనే పెట్టిన ఫ్రాంఛైజీలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కృష్ణప్ప.. రూ. 90 లక్షలకే లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ సొంతమయ్యాడు. రూ. 50 లక్షల బేస్​ప్రైజ్​కు వేలంలోకి వచ్చిన గౌతమ్​ కోసం కోల్​కతా, దిల్లీ కూడా పోటీపడినా.. లఖ్​నవూ దక్కించుకుంది.

టీ20లో కృష్ణప్ప గౌతమ్‌ రికార్డు

కృష్ణప్ప గౌతమ్ టీ20లో 67 మ్యాచ్‌లు ఆడి 48 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 7.39 పరుగులు మాత్రమే. గౌతమ్ టీ20లో 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో కృష్ణప్ప గౌతమ్ ప్రదర్శన ప్రత్యేకం కాదు. అతను 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో అతను 5 సగటుతో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2022 వేలంలో అతను నష్టపోవడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. అయితే, కృష్ణప్ప గౌతమ్‌కి మంచి విషయం ఏమిటంటే.. అతను లక్నో సూపర్‌జెయింట్‌లో మ్యాచ్‌లు ఆడే అవకాశాలను పొందగలడు.  

లక్నో సూపర్‌జెయింట్ జట్టు గురించి చెప్పాలంటే.. వారికి దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే అవసరమైతే గౌతమ్ కూడా అవకాశాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి: IPL 2022 Auction Live, Day 2: టిమ్ డేవిడ్‌ని భారీ ధర పెట్టిన ముంబై ఇండియన్స్.. ఎందుకో తెలుసా..