Chama Milind IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ సీపీ కుమారుడు.. సొంతం చేసుకున్న కోహ్లీ టీం..
Chama Vrajendra Milind Auction Price: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిళింద్ ఆనంద్.. ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. కోహ్లీ టీం రూ. 25లక్షలకు ఈ హైదరాబాదీని సొంతం చేసుకుంది.
Chama Vrajendra Milind Auction Price: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు మిళింద్ ఆనంద్.. ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. కోహ్లీ టీం రూ. 25లక్షలకు ఈ హైదరాబాదీని సొంతం చేసుకుంది. చామ వి మిళింద్ హైదరాబాద్‌కు చెందిన ఎడమ చేతి బ్యాట్స్‌మెన్. అలాగే ఎడమ చేతి మీడియం బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఈ 20 ఏళ్ల యువకుడు గతంలో SRH తరుపున ఐపీఎల్‌లో ఆడాడు. ఇవి కాకుండా హైదరాబాద్ జట్టు, టీమిండియా అండర్-19 జట్టులో సభ్యుడిగా నిలిచాడు. మిళింద్ అరోరా డిగ్రీ కళాశాలలో చదివాడు.
ఆసీస్ లెఫ్ట్ ఆర్మర్ మిచెల్ జాన్సన్, తుఫాన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌లను ఎక్కువగా ఆరాధించే మిలింద్, ఆర్డర్ డౌన్‌లో చాలా చక్కగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పర్యటన కోసం భారత అండర్-19 జట్టులోనూ ఆడిన మిలింద్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 53 మ్యాచులు ఆడిన మిళింద్ 83 వికెట్లు పడగొట్టాడు. 17 సగటు, 7.63 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీలో చోటు దక్కించుకోవడంతో మరింత రాటుదేలే అవకాశం ఉందని అంటున్నారు.
#PlayBold #WeAreChallengers #IPLMegaAuction #IPL2022 #IPLAuction pic.twitter.com/uZWMJIv1Sr
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2022
Also Read: IPL 2022 Auction: గత ఏడాది రూ. 9.25 కోట్లు.. ఈ ఏడాది రూ. 90 లక్షలు.. ఈ ఆటగాడు ఎవరో గుర్తు పట్టండి..