IPL 2021: రేపటి నుంచే ఐపీఎల్ 2021 రెండో దశ.. సిద్ధమైన యూఏఈ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) రెండవ దశ సెప్టెంబర్ 19 న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచుతో మొదలుకానుంది.
IPL 2021: మూడు నెలల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 2021 ఎడిషన్ సెప్టెంబర్ 19 న మరోసారి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో దుబాయ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ లీగ్ మొదలుకానుంది. భారత్‌లో జరిగిన మొదటి దశలో 29 మ్యాచులు జరిగాయి. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఫలించి, యూఏఈలో రేపటి నుంచి మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ముస్తాబైంది.
మొత్తం 31 మ్యాచ్‌లు 27 రోజుల వ్యవధిలో జరగనున్నాయయని బీసీసీఐ తెలిపింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచుతో రెండవ దశ మొదలుకానుంది. ఆ తరువాత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ అబుదాబిలో జరుగుతుంది. దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. చివరి లీగ్ గేమ్ అక్టోబర్ 8 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.
మొదటి క్వాలిఫయర్ అక్టోబర్ 10 న దుబాయ్‌లో, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 షార్జాలో అక్టోబర్ 11, 13 న జరుగుతాయి. దుబాయ్‌లో అక్టోబర్ 15 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
IPL 2021 రెండవ దశ పూర్తి షెడ్యూల్:
పాయింట్ల పట్టిక:
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత ఎనిమిది మ్యాచ్‌లలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్(10 పాయింట్లు), మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ (10 పాయింట్లు), నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.
ఐపీఎల్ 2021 ఎప్పుడు, ఎక్కడ చూడాలి? 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఆన్‌లైన్‌లో హాట్‌స్టార్, జియోటీవీలో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ HD ఛానెళ్లలో మ్యాచులు టెలికాస్ట్ కానున్నాయి.
INDW vs AUSW: డే-నైట్ టెస్టులో ఈ యువ ఆల్ రౌండర్ పాత్ర చాలా కీలకం: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాజీ దిగ్గజాలు మరోసారి మైదానంలోకి.. ఎప్పుడో తెలుసా?