Virat Kohli: భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా అతనే అర్హుడు.. ఒత్తిడితోనే కోహ్లీ తప్పుకున్నాడు: మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్

టీ 20 కెప్టెన్‌గా వైదొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం మూడు ఫార్మాట్లలో ఉన్న పని భారాన్ని బట్టి తీసుకున్నాడని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు.

Virat Kohli: భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా అతనే అర్హుడు.. ఒత్తిడితోనే కోహ్లీ తప్పుకున్నాడు: మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్
Dilip Vengsarkar
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2021 | 8:14 AM

Indian Cricket Team: 2021 నవంబర్‌లో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీ 20 కెప్టెన్‌గా వైదొలగాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అభిమానులతోపాటు నిపుణులకు షాక్ లాంటిదే. గురువారం సాయంత్రం టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు చేసిన పోస్ట్‌పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో తమ ప్రేమను వెల్లడించారు. అలాగే తదుపరి కెప్టెన్ ఎవరంటూ చర్చలు కూడా మొదలు పెట్టారు. క్రికెట్ పండితులు కూడా కోహ్లీ వారసుడిని కనుగొనే పనిలో పడ్డారు. ఆట యొక్క అతి తక్కువ ఫార్మాట్‌లో ఊహించడం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ, టీ 20 ల్లో టీమిండియాకు నాయకత్వం వహించడానికి ప్రస్తుత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్హులని వెల్లడించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ‘ఐపీఎల్ ఫ్రాంచైజీలో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడని, తనకు అవకాశం వచ్చిన సందర్భాల్లో టీమిండియాకు నాయకత్వం వహించి అద్భుత ‎ఫలితాలు రాబట్టాడని’ ఆయన పేర్కొన్నారు.

“రోహిత్ టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా ఉండటానికి అర్హుడు. ఎందుకంటే అతనికి అవకాశం ఇచ్చినప్పుడల్లా తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. 2018 లో అతని కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ గెలిచింది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్‌కు తిరుగులేని కెప్టెన్‌గా ఉన్నాడు ” అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.

టీ 20 కెప్టెన్‌గా వైదొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ, మూడు ఫార్మాట్లలో అతని ముందున్న పని భారాన్ని బట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డారు.

“దాదాపు ఎనిమిది సంవత్సరాలు అన్ని ఫార్మాట్లలో కోహ్లీ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఉత్తమ ప్రదర్శన కోసం విపరీతమైన ఒత్తిడికి గురయ్యాడు. ఎందుకంటే అతను బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతిసారి అభిమానులు ఎంతో ఆశిస్తారు. అతని నిర్ణయం వెల్లడించిన సమయం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అంతా ఆశిస్తున్న విషయం ఏమిటంటే, కోహ్లీ ప్రపంచ కప్ గెలిచి, భారత టీ 20 కెప్టెన్‌గా అత్యున్నత స్థాయికి చేరడమే. టీ 20 కెప్టెన్‌గా ఇది అతని చివరి విజయంగా ఉండిపోతుంది ” అని వెంగ్‌సర్కార్ అన్నారు.

Also Read: INDW vs AUSW: డే-నైట్ టెస్టులో ఈ యువ ఆల్ రౌండర్ పాత్ర చాలా కీలకం: భారత మాజీ క్రికెటర్

క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాజీ దిగ్గజాలు మరోసారి మైదానంలోకి.. ఎప్పుడో తెలుసా?

BCCI: జూనియర్ సెలెక్షన్ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. చైర్మన్‌గా 27 సెంచరీలు చేసిన ఆటగాడు..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..