INDW vs AUSW: డే-నైట్ టెస్టులో ఈ యువ ఆల్ రౌండర్ పాత్ర చాలా కీలకం: భారత మాజీ క్రికెటర్

Shafali Verma: భారత మహిళల క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. టీమిండియా తొలిసారిగా పింక్ బాల్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

INDW vs AUSW: డే-నైట్ టెస్టులో ఈ యువ ఆల్ రౌండర్ పాత్ర చాలా కీలకం: భారత మాజీ క్రికెటర్
India Womens Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2021 | 7:33 AM

INDW vs AUSW: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత పురుషుల క్రికెట్ జట్టు గత సంవత్సరం ఆస్ట్రేలియా పర్యటనలో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అడిలైడ్‌లో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది దాని టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్కోరు. ఇప్పుడు మరో భారత జట్టు పింక్ బాల్ టెస్ట్‌ను ఆస్ట్రేలియాలో ఆడేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. భారత మహిళల జట్టు మొదటిసారిగా డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో సీనియర్ ప్లేయర్‌ల పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే యువ ఓపెనర్ షఫాలి వర్మ కూడా ఈ మ్యాచులో ఆడనుంది. ఈమేరకు భారత మాజీ క్రికెటర్ హేమ్లాత కాలా మాత్రం షెఫాలి వర్మ ఈ టెస్ట్ మ్యాచులో చాలా కీలకమని వెల్లడించారు.

భారతీయ సంచలనం షెఫాలీ, కేవలం 17 సంవత్సరాల వయస్సులోనే ఈ సంవత్సరం టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. జూన్‌లో ఇంగ్ల్డ్ పర్యటనలో టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన షెఫాలీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీలతో ఆకట్టకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆమె కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయింది. పొట్టి ఫార్మాట్‌లో తన బ్యాటింగ్‌లో ఓ ముద్ర వేసిన షెఫాలీకి, టెస్ట్ క్రికెట్‌లో బలమైన ప్రదర్శనతో అంచనాలు కూడా పెరిగాయి.

షెఫాలీ పాత్ర చాలా కీలకం.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచిన షెఫాలీ.. తనదైన దూకుడు ఆటతో ఆకట్టుకుంది. ఈ పర్యటన కోసం జట్టును ఎంపిక చేసిన భారత మాజీ ఆల్ రౌండర్ హేమ్లాత కాలా, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ, “షెఫాలీ పాత్ర ముఖ్యమైనది. ఆమె రెడ్-బాల్‌లో విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె దూకుడుగా ఆడటానికి ఇష్టపడుతుంది. ఇతర బ్యాట్స్‌మెన్‌ల కంటే కూడా షెఫాలి ఆట ఎంతగానో ముఖ్యమైనది’ అని అన్నారు.

ఇంగ్లండ్ కంటే మెరుగ్గా రాణించాలి.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ కంటే ఈసారి జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టును పరీక్షించడానికి ఈ పర్యటన ఒక మంచి అవకాశంగా ఉండనుంది. “పింక్ బాల్‌తో టెస్టులు ఆడిన అనుభవం భవిష్యత్తులో టీంకు సహాయపడుతుంది. ఇంగ్లండ్ టెస్టులో కంటే ఎంతో మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ టెస్టు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చాలా కాలం తర్వాత ఆడుతున్నాం. ఇది ఆటగాళ్లకు కొత్త ఫార్మాట్ లాంటిది. ప్రతీ ఫార్మాట్ మాకు ముఖ్యం. 50 ఓవర్ల ప్రపంచ కప్ వస్తోంది. కాబట్టి ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం మంచిదని’ తెలిపారు.

సెప్టెంబర్ 21 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీని తరువాత, సెప్టెంబర్ 30 నుంచి ఏకైక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడతారు. పర్యటన చివరిలో అంటే అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ప్రారంభమవుతుంది.

Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మాజీ దిగ్గజాలు మరోసారి మైదానంలోకి.. ఎప్పుడో తెలుసా?

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో ‘మిషన్ 87’ను ముగించే దిశగా విరాట్ కోహ్లీ.. అసలు దీని లక్ష్యమేంటో తెలుసా?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..