T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో ‘మిషన్ 87’ను ముగించే దిశగా విరాట్ కోహ్లీ.. అసలు దీని లక్ష్యమేంటో తెలుసా?
కెప్టెన్ విరాట్ కోహ్లీ 'మిషన్ 87' ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఈ లక్ష్యం చేరుకున్నట్లయితే, టీ 20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పే ముందు ఓ అద్భుత రికార్డుతో ముగించేందుకు ఆస్కారం ఉంది.
Virat Kohli: టీ 20 కెప్టెన్సీ పరంగా, టీ 20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి చివరి అవకాశంగా ఉంది. అయితే ఈలోపు కెప్టెన్‌గా టీ20 లో కోహ్లీ ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఐసీసీ ట్రోఫీని సాధించాలనే కల పొట్టి ప్రపంచ కప్‌తో తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. దీనితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘మిషన్ 87’ ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. టీ 20 ప్రపంచకప్‌లో ఈ లక్ష్యం చేరుకున్నట్లయితే, టీ 20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పే ముందు ఓ అద్భుత రికార్డుతో ముగించేందుకు ఆస్కారం ఉంది.
ఈ మిషన్ 87 ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఈ మిషన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేయడానికి సంబంధించినది. ప్రపంచంలోని టీ20 కెప్టెన్‌ల మధ్య దోబూచులాడుతున్న ఈ రికార్డును విరాటో సొంతమైతే.. ప్రస్తుత టీ20 కెప్టెన్‌లతో విరాట్ అత్యధిక పరుగులు సాధించిన వాడిగా నిలవనున్నాడు. విరాట్ తన మిషన్ 87 ని అమలు చేస్తే, తొలి భారత కెప్టెన్‌గాను మారనున్నాడు.
ఫించ్-విరాట్ మధ్య దూరం 87 పరుగులు వాస్తవానికి, అత్యధిక పరుగులు చేసిన టీ 20 కెప్టెన్లలో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు. అతని ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఆరోన్ ఫించ్ ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలతో 36.11 సగటుతో 1589 పరుగులు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 48.45 సగటుతో 12 అర్ధ సెంచరీల సహాయంతో 1502 పరుగులు పూర్తి చేశాడు. ఫించ్, విరాట్ మధ్య పరుగుల దూరం కేవలం 87 పరుగులు. ఇప్పుడు విరాట్ తన చివరి టెస్ట్ కెప్టెన్సీలో అంటే టీ 20 ప్రపంచ కప్‌లో బ్యాట్‌తో పరుగులు సాధిస్తే.. ఈ87 పరుగుల దూరాన్ని చెరిపేసే అవకాశం ఉంది.
టాప్ 5 లో కూడా.. అంతర్జాతీయ టీ20 కెప్టెన్‌ల జాబితాలో పరుగుల కోసం నిజమైన యుద్ధానికి తెరలేవనుంది. అది టీ20 ప్రపంచ కప్‌లోనే తీర్చుకునేందుకు టాప్ 5లోని కెప్టెన్‌లు బరిలోకి దిగనున్నారు. విరాట్, ఫించ్‌తో పాటు, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 31.43 సగటుతో 11 అర్ధ సెంచరీలతో 1383 పరుగులు చేయగా, ఇంగ్లడ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఖాతాలో 1371 పరుగులు ఉన్నాయి. అదే సమయంలో, దక్షిణాఫ్రికా కెప్టెన్సీ నుంచి నిష్క్రమించిన ఫాఫ్ డు ప్లెసిస్ 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 37.44 సగటుతో 1273 పరుగులు చేశాడు. అయితే డుప్లెసిస్ ఈ బరిలో లేడని తెలుస్తోంది.
Also Read: IPL 2021: విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల మధ్య బౌండరీల పోరు.. ఎవరు ముందున్నారో తెలుసా?
IPL 2021 Schedule: హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్.. రోహిత్ టీం పూర్తి షెడ్యూల్..!