Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Schedule: హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్.. రోహిత్ టీం పూర్తి షెడ్యూల్..!

కరోనా కారణంగా టోర్నమెంట్ నిలిపివేసే ముందు ముంబై ఇండియన్స్ సీజన్‌లో ఆరంభం అంత గొప్పగా ఏం లేదు. తొలి దశలో 7 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది.

IPL 2021 Schedule: హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్.. రోహిత్ టీం పూర్తి షెడ్యూల్..!
Ipl 2021 Mumbai Indians
Follow us
Venkata Chari

|

Updated on: Sep 17, 2021 | 12:13 PM

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ రెండవ భాగం ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. కరోనా వైరస్ సంక్రమణ తర్వాత మధ్యలో వాయిదా పడిన టోర్నమెంట్, ప్రస్తుతం సెప్టెంబర్ 19 నుంచి సుమారు నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుంది. మొదటి భాగంలో 29 మ్యాచ్‌లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్‌తో ప్రారంభమవుతాయి. దీంతో పాటు, గత సీజన్‌లో యూఏఈలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌పైనే దృష్టి ఉంటుంది.

ఈ సీజన్ ప్రారంభం ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై టీం పేరుగాంచింది. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు మొదటి 7 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచింది. అదే సమయంలో 3 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం, ఈ జట్టు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తర్వాత 8 పాయింట్లతో పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. మొదటి 7 మ్యాచ్‌లలో జట్టు 150 నుంచి 160 మధ్య స్కోర్ చేయగలిగింది. చెన్నైతో జరిగిన ఒక మ్యాచ్‌లో మాత్రమే కీరన్ పొలార్డ్ తుఫాను ఇన్నింగ్స్ సహాయంతో జట్టు 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించింది.

యూఏఈలో ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్ ముంబై ఈ సీజన్‌లో లీగ్ దశలో మిగిలిన 7 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లను అబుదాబిలో ఆడాల్సి ఉంది. షార్జా, దుబాయ్‌లో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ మిగిలిన 7 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:

– 19 సెప్టెంబర్ (ఆదివారం): ముంబై vs చెన్నై సూపర్ కింగ్స్, రాత్రి 7:30, దుబాయ్ – 23 సెప్టెంబర్ (గురువారం): ముంబై vs కోల్‌కతా నైట్ రైడర్స్, రాత్రి 7:30 , అబుదాబి – 26 సెప్టెంబర్ (ఆదివారం): ముంబై vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30, దుబాయ్ – 28 సెప్టెంబర్ (గురువారం): ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్, రాత్రి 7:30 , అబుదాబి – 02 అక్టోబర్ (శనివారం): ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, మధ్యాహ్నం 3:30, షార్జా – అక్టోబర్ 05 ( మంగళవారం): ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, రాత్రి 7:30, షార్జా – అక్టోబర్ 08 (శుక్రవారం): ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, మధ్యాహ్నం 3:30, అబుదాబి

Also Read:

TV9 Poll: టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వీరిలో ఎవరికుంది?

హిట్ మ్యాన్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా ఆ ఆటగాడికే సునీల్ గవాస్కర్ ఓటు

Yuzvendra Chahal: బీసీసీఐ సెలక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన యుజ్వేంద్ర చాహల్..! జస్ట్ కిడ్డింగ్ అన్నా.. వదలని నెటిజన్లు