Yuzvendra Chahal: బీసీసీఐ సెలక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన యుజ్వేంద్ర చాహల్..! జస్ట్ కిడ్డింగ్ అన్నా.. వదలని నెటిజన్లు
భారత టీ 20 వరల్డ్ కప్ 2021 జట్టులో యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నిజంగా పెద్ద షాక్. ఏది ఏమైనప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా వైట్-బాల్ క్రికెట్‌లో లెగ్ బ్రేక్ బౌలర్‌గా భారత్ తరపున ప్రధాన స్పిన్నర్‌గా చాహల్ ఆకట్టుకుంటున్నాడు.
Yuzvendra Chahal: భారత టీ 20 వరల్డ్ కప్ 2021 జట్టులో యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నిజంగా పెద్ద షాక్. ఏది ఏమైనప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా వైట్-బాల్ క్రికెట్‌లో లెగ్ బ్రేక్ బౌలర్‌గా భారత్ తరపున ప్రధాన స్పిన్నర్‌గా చాహల్ ఆకట్టుకుంటున్నాడు. అతను ఇటీవల తన అత్యున్నత స్థితిలో లేనప్పటికీ, చాహల్ శ్రీలంక పర్యటనలోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఏదేమైనా యూఏఈ, ఒమన్ పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలిస్తాయి. అయినా సెలెక్టర్లు 31 ఏళ్ల బౌలర్‌ను ఎంచుకోలేదు.
టీమిండియా బెర్త్‌ను కోల్పోయినందుకు చాహల్ నిరాశ చెందాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయంపై అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీసీఐ సెలెక్టర్లు 15 మంది సభ్యుల జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చారు. రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్‌లను ఎన్నుకున్నారు.
చాహల్ గురించి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడుతూ, వేగంగా బౌలింగ్ చేసే స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చామని’ పేర్కొన్నారు. ఈ వివరణ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) లెగ్ స్పిన్నర్ చాహల్‌కు అంతగా రుచించలేదు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్టర్లపై వ్యంగ్యంగా తన స్పిన్‌ను సంధించాడు. వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా చేసిన ట్వీట్‌కు సమాధానమిస్తూ, ‘వేగవంతమైన స్పిన్నర్‌ల’ డిమాండ్‌పై చాహల్ వ్యంగ్యాస్త్రాలు వదిలాడు.
చోప్రా తన పోస్ట్‌లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 యూఏఈలో వేగంగా బౌలింగ్ చేసే స్పిన్నర్‌లు విజయం సాధిస్తారని సూచించాడు. అదే విధంగా స్పందించిన చాహల్ ‘వేగవంతమైన స్పిన్నర్ల’ అవసరాన్ని ప్రశ్నించాడు. #justkidding” అంటూ నవ్వుతున్న ఎమోజీతో పాటు వ్యాఖ్యానించాడు.
టీ 20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ పొట్టి ప్రపంచ కప్‌లో లేకపోవడం సంతోషంగా లేడని ఈ కామెంట్‌తో తెలుస్తుంది. దీంతో నెటిజన్లు చాహల్ కామెంట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. చాహల్ 49 మ్యాచుల్లో 63 వికెట్లు పడగొట్టాడు.
“ముఖ్యంగా ఐపీఎల్ తర్వాత తన ఫాంతో కొంత ఇబ్బంది పడుతున్నాను. దీంతోనే టీ20 ప్రపంచ కప్‌లో సెలక్టర్ల చూపు పడనట్లుంది. ఇలాంటి విపత్కర సమయంలో నా భార్య ధనశ్రీ నాకు అండగా నిలిచింది ” అని ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో చాహల్ తెలిపాడు.
Faster spinner bhaiya? ???#justkidding ?
— Yuzvendra Chahal (@yuzi_chahal) September 16, 2021
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్ రికార్డులు వీరివే.. టాప్ 5లో ఇద్దరు భారత బౌలర్లు కూడా..!