IPL 2021: 18 బంతుల్లో 88 పరుగులతో మారణకాండ సృష్టించిన కివీస్ బ్యాట్స్‌మెన్.. ఐపీఎల్‌లో ఏ జట్టుతో ఆడుతున్నాడో తెలుసా?

అతను కేవలం 18 బంతుల్లో 88 పరుగులతో మైదానంలో మారణకాండ సృష్టించాడు. అలాంటి ఆటగాడు ప్రస్తుతం ఐపీఎల్ రెండో సీజన్‌లో ఏజట్టుతో ఆడనున్నాడో తెలుసా?

IPL 2021: 18 బంతుల్లో 88 పరుగులతో మారణకాండ సృష్టించిన కివీస్ బ్యాట్స్‌మెన్.. ఐపీఎల్‌లో ఏ జట్టుతో ఆడుతున్నాడో తెలుసా?
Ipl 2021
Follow us
Venkata Chari

|

Updated on: Sep 17, 2021 | 9:54 AM

Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ రెండవ దశ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, రెండవ దశలో, అనేక ఫ్రాంచైజీల నుంచి చాలా మంది ఆటగాళ్లు తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో, ఇతర ఆటగాళ్లకు వారి స్థానంలో ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఒక జట్టు ఓ అద్భుత బ్యాట్స్‌మెన్‌ని జట్టులో చేర్చుకుంది. అతను కేవలం 18 బంతుల్లో 88 పరుగులతో మైదానంలో మారణకాండ సృష్టించాడు. అలాంటి ఆటగాడు ప్రస్తుతం ఐపీఎల్ రెండో సీజన్‌లో ఏజట్టుతో ఆడనున్నాడో తెలుసా?

‎ఆ బ్యాట్స్‌మెన్ పేరు గ్లెన్ ఫిలిప్స్. ఈ న్యూజిలాండ్ ప్లేయర్‌ని సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ చేర్చుకుంది. 6 డిసెంబర్ 1996 న దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్‌లో జన్మించిన ఫిలిప్స్, ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో న్యూజిలాండ్‌కు వెళ్లారు. న్యూజిలాండ్ తరపున 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. నవంబర్ 2020 లో న్యూజిలాండ్ తరఫున టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించాడు. 29 నవంబర్ 2020 న వెస్టిండీస్‌పై 51 బంతుల్లో 108 పరుగుల ఇన్నింగ్స్‌లో ఫిలిప్స్ కేవలం 18 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్‌లతో 88 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఫిలిప్స్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బార్బడోస్ రాయల్స్ కోసం 10 మ్యాచ్‌ల్లో 31.75 స్ట్రైక్‌రేట్‌తో 128 సగటుతో పరుగలు సాధించాడు. 28 స్ట్రైక్ రేట్ వద్ద 254 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 16 ఫోర్లతో పాటు అనే సిక్సర్లు బాదేశాడు.

144 మ్యాచ్‌ల్లో 318 ఫోర్లు, 218 సిక్సర్లు.. గ్లెన్ ఫిలిప్స్ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున 25 టీ 20 ల్లో ఆడాడు. ఇందులో అతను 22 ఇన్నింగ్స్‌లలో 506 పరుగులు పూర్తిచేశాడు. 4 సార్లు అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో అతని సగటు 28.11, స్ట్రైక్ రేట్ 149.70గా నమోదైంది. అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి. టీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 108 పరుగులు. ఈ 25 మ్యాచ్‌లలో 39 ఫోర్లు కాకుండా అతని బ్యాట్ నుంచి 29 సిక్సర్లు కూడా రాలాయి. కేవలం ఒకే ఒక టెస్ట్ ఆడిన గ్లెన్ 52 పరుగులు చేశాడు. టీ 20 క్రికెట్ విషయానికొస్తే, 144 మ్యాచ్‌లలో అతను 33.04 సగటుతో 142.22 స్ట్రైక్ రేట్‌తో 3998 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫిలిప్స్ అత్యధిక స్కోరు 116గా నమోదైంది. ఈ 144 మ్యాచ్‌లలో, అతను 318 ఫోర్లు, 218 సిక్సర్లు బాదాడు.

Also Read: IPL 2021: ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్‌ రికార్డులు వీరివే.. టాప్‌ 5లో ఇద్దరు భారత బౌలర్లు కూడా..!

Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయంపై అనుష్క శర్మ స్పందన ఏంటో తెలుసా.. సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..?