AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రోహిత్ స్నేహితుడిపై దాడిచేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్.. ఈ ఆటగాడి బ్యాట్‌కి భయపడుతోన్న బౌలర్లు

ఈ టోర్నీలో ఎన్నో తుఫాన్‌‌లాంటి ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో ఆడిన 14 వ సీజన్ మొదటి దశలో కూడా అలాంటి ఒక ఇన్నింగ్స్ కనిపించింది.

IPL 2021: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రోహిత్ స్నేహితుడిపై దాడిచేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్.. ఈ ఆటగాడి బ్యాట్‌కి భయపడుతోన్న బౌలర్లు
Rohit
Venkata Chari
|

Updated on: Sep 18, 2021 | 9:10 AM

Share

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్. రేపటి నుంచి రెండో దశ మ్యాచులకు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఎన్నో తుఫాన్‌‌లాంటి ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో ఆడిన 14 వ సీజన్ మొదటి దశలో కూడా అలాంటి ఒక ఇన్నింగ్స్ కనిపించింది. మొదటి దశలో కరోనా వైరస్ కారణంగా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండవ దశ 19 సెప్టెంబర్ నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ స్నేహితుడితో ఈ ఆటగాడు భీకర పోరాటం చేసిన తెరపైకి వచ్చాడు. అలాగే రెండవ దశలో కూడా బ్యాట్‌తో విధ్వంసాలు నెలకొల్పేందుకు రెడీ అయ్యాడు.

కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా తుఫాన్ ఇన్నింగ్స్‌కు కారణమయ్యాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీం ప్లేయర్ కృనాల్ పాండ్యతో పోరాటం చేశాడు. ఐపీఎల్ -2021 లో హుడా పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఏప్రిల్ 12 న ముంబైలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హుడా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. హుడా పంజాబ్ స్కోరు 221 పరుగులలో కేవలం 28 బంతుల్లో 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 ఫోర్లు, ఆరు సిక్సర్లు కూడా ఉన్నాయి. అంటే, ఫోర్లు, సిక్సర్ల సహాయంతో అతను కేవలం 10 బంతుల్లో 52 పరుగులు పేర్తి చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో ప్రదర్శన విషయానికొస్తే దీపక్ హుడా పంజాబ్ కింగ్స్ కోసం ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఈ సీజన్‌లో జట్టు కోసం మొత్తం ఎనిమిది మ్యాచ్‌లలో భాగస్వామి అయ్యాడు. ఏడు సార్లు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఒకసారి అతను నాటౌట్‌గా నిలిచాడు. ఈ 7 మ్యాచ్‌లలో హుడా 116 పరుగులు చేశాడు. 19.33 సగటుతో పరుగులు సాధించాడు. అయితే 143.20 అద్భుతమైన స్ట్రైక్ రేట్ వద్ద ఈ పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం రెండో దశలో, ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచడానికి జట్టు తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. దీంతో హుడాపై టీం భారీ అంచనాలు పెట్టుకుంది. పంజాబ్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా వాటిలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

Also Read: IPL 2021: రేపటి నుంచే ఐపీఎల్ 2021 రెండో దశ.. సిద్ధమైన యూఏఈ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Virat Kohli: భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా అతనే అర్హుడు.. ఒత్తిడితోనే కోహ్లీ తప్పుకున్నాడు: మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్

INDW vs AUSW: డే-నైట్ టెస్టులో ఈ యువ ఆల్ రౌండర్ పాత్ర చాలా కీలకం: భారత మాజీ క్రికెటర్