సన్‌రైజర్స్ కెప్టెన్‌గా విలియమ్సన్ కొనసాగుతాడు-లక్ష్మణ్
హైదరాబాద్: ఈ సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్‌విలియమ్సన్ కొనసాగనున్నాడు. ఈసారి వార్నర్ రీ ఎంట్రీ మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గతేడాది మార్చిలో వార్నర్, స్మిత్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. వార్నర్‌పై నిషేధంతో గతేడాది అనూహ్యంగా కెప్టెన్సీ అందుకుని జట్టుకు పలు విజయాలను అందించిన న్యూజిలాండ్ ఆటగాడు కేన్‌విలియమ్సన్ ఈసారీ కూడా బాధ్యతలు కొనసాగిస్తాడని లక్ష్మణ్ […]

హైదరాబాద్: ఈ సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్‌విలియమ్సన్ కొనసాగనున్నాడు. ఈసారి వార్నర్ రీ ఎంట్రీ మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గతేడాది మార్చిలో వార్నర్, స్మిత్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. వార్నర్‌పై నిషేధంతో గతేడాది అనూహ్యంగా కెప్టెన్సీ అందుకుని జట్టుకు పలు విజయాలను అందించిన న్యూజిలాండ్ ఆటగాడు కేన్‌విలియమ్సన్ ఈసారీ కూడా బాధ్యతలు కొనసాగిస్తాడని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల్లో వార్నర్ నిషేధం ముగియనుంది. దీంతో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచులు ఆడేందుకు వారికి అవకాశం లభించనుంది. వార్నర్ రాకతో సన్‌రైజర్స్ జట్టు మరింత బలంగా మారనుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గతంలో సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్ నిషేధం అనంతరం మెయిన్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగనున్నాడు. అలాగే భువనేశ్వర్‌కుమార్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని లక్ష్మన్ స్పష్టం చేశారు. కాగా ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ మొదటి మ్యాచ్ ఆడనుంది.
