టీ20ల్లో నంబర్ వన్.. టెస్ట్‌లకు దడ పుట్టించేందుకు సిద్ధమైన టీమిండియా సెన్సేషన్: లారా
అభిషేక్ శర్మ ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగాలనే దృఢ సంకల్పం అతనికి ఉందని బ్రియాన్ లారా మాటలు స్పష్టం చేస్తున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అవకాశాల కోసం కృషి చేస్తున్న అభిషేక్, త్వరలోనే భారత రెడ్-బాల్ జట్టులో సుస్థిర స్థానం సంపాదిస్తాడని క్రికెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

India’s T20 Superstar: టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న భారత యువ సంచలనం అభిషేక్ శర్మ గురించి వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు సాధించిన విజయాల పట్ల ఎంతగానో సంతోషించినప్పటికీ, అభిషేక్ అసలైన లక్ష్యం మాత్రం భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడమే అని లారా వెల్లడించారు.
ప్రత్యేకమైన ఆటగాడు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కోచ్‌గా పనిచేసిన సమయంలో తాను అభిషేక్‌ను దగ్గరగా చూశానని లారా తెలిపారు. “అభిషేక్ ఒక ప్రత్యేకమైన టాలెంట్. కోవిడ్ సమయంలో ఎస్ఆర్‌హెచ్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఇతడు మాత్రం చాలా ప్రత్యేకమైనవాడు. యువరాజ్ సింగ్ అతని ఆటపై గొప్ప ప్రభావాన్ని చూపారు. అతని బ్యాట్ స్పీడ్, షాట్ ప్లేస్‌మెంట్, బంతిని సరిగ్గా కొట్టే విధానం అద్భుతంగా ఉంటాయని” లారా కొనియాడారు.
టెస్ట్ క్రికెట్ లక్ష్యం..
టీ20 క్రికెట్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ దృష్టి కేవలం టెస్ట్ క్రికెట్‌పైనే ఉందని లారా పేర్కొన్నారు. “అతను టీ20 క్రికెట్‌లో ఎంత విజయవంతంగా ఉన్నప్పటికీ, టెస్ట్ జట్టులోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకోవడానికి నన్ను తరచుగా సంప్రదిస్తుంటాడు. ఇలాంటి పెద్ద ఆలోచన కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైన విషయం. ఒక యువ ఆటగాడు అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకోవడం, టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం అతని సంకల్పం, నిబద్ధతను తెలియజేస్తుంది. అతని ఆటను నేను ఎంతో ఇష్టపడుతున్నాను. అతను రోజురోజుకు మెరుగుపడుతూ కొత్త స్థాయికి చేరుకుంటున్నాడు,” అని లారా అన్నారు.
అభిషేక్ శర్మ ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగాలనే దృఢ సంకల్పం అతనికి ఉందని బ్రియాన్ లారా మాటలు స్పష్టం చేస్తున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అవకాశాల కోసం కృషి చేస్తున్న అభిషేక్, త్వరలోనే భారత రెడ్-బాల్ జట్టులో సుస్థిర స్థానం సంపాదిస్తాడని క్రికెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




