టీమిండియా రన్ మెషిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ మొన్నటివరకు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. వరుస సెంచరీలు చేసిన ఈ ఆటగాడు పరుగులు చేయడానికే ఇబ్బంది పెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు పేలవమైన ఫామ్‌తో తంటాలు పట్టాడు. కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. జట్టులో చోటుపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్ అన్న మాటను నిజం చేస్తూ గతేడాది ఆసియా కప్‌లో అదిరిపోయే లెవెల్‌లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. అలా గత 6 నెలల్లో ఏకంగా 5 సెంచరీలు బాదేశాడు. తన బ్యాట్ పవరేంటో ప్రత్యర్థులకు రుచి చూపిస్తున్నాడు. ఇలా కోహ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ వెనక అతను చేసిన దైవ దర్శనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇటీవల ముగిసిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు విరాట్. మూడు టెస్టుల్లో కనీసం అర్ధసెంచరీ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయాడు. అయితే చివరిదైన నాలుగో టెస్టుకు ముందు సతీమణి అనుష్కతో కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అంతే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 186 పరుగులతో రెచ్చిపోయాడు. ఇక టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎవ్ రాహుల్ కూడా గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వైస్ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో విఫలం కావడంతో మూడో టెస్టు నుంచే కేఎల్ రాహుల్‌ను తప్పించారు. ఆఖరి టెస్టులోనూ చోటు దక్కలేదు. వన్డే జట్టులోనూ అవకాశం వస్తుందా..? లేదా..? అన్న సందేహాలు తలెత్తాయి.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడం.. మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో మొదటి మ్యాచ్‌లో రాహుల్‌కు అవకాశం లభించింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో 75 పరుగులు చేసి జట్టును గెలిపించాడు రాహుల్. తద్వారా తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టేశాడు. అయితే ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందే తన భార్య అతియాశెట్టితో కలిసి ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లాడు రాహుల్. అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆసీస్‌తో చివరి రెండు టెస్టు్లో అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఘనంగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ, రాహుల్ సక్సెస్ అవ్వడానికి మహాకాళేశ్వర టెంపుల్ కారణమని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ దేవాలయానికి ఎంతో మహత్యం ఉందని, అక్కడ పూజలు చేస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, సక్సెస్ పక్కా అని చర్చించుకుంటున్నారు.
#WATCH | Actor Anushka Sharma & Cricketer Virat Kohli offered prayers to Lord Shiva at Mahakaleshwar temple in Ujjain, Madhya Pradesh today morning pic.twitter.com/FBq3KsrNU2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
Jab insaan har jagah se haar jaata hai to bhagwan hi sahara dete hain 💙🧡🙏#KLRahulpic.twitter.com/YT2HHmTv33
— Prayag (@theprayagtiwari) February 26, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..