Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. 4 ఓవర్లలో 5 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. టీమిండియా బౌలర్ రికార్డుల ఊచకోత

India Women U19 vs Malaysia Women U19: అండర్ 19 T20 ప్రపంచకప్‌లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ విధ్వంసం సృష్టించి మలేషియాను కేవలం 31 పరుగులకే ఆలౌట్ చేసింది. వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టింది, ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది.

Video: వామ్మో.. 4 ఓవర్లలో 5 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. టీమిండియా బౌలర్ రికార్డుల ఊచకోత
India Vs Malaysia Vaishnavi Sharma Hattrick
Follow us
Venkata Chari

|

Updated on: Jan 21, 2025 | 1:55 PM

India Women U19 vs Malaysia Women U19: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పిన్నర్ వైష్ణవి శర్మ విధ్వంసం సృష్టించి మలేషియాను కేవలం 31 పరుగులకే ఆలౌట్ చేసింది. వైష్ణవి 4 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది. వైష్ణవి తన స్పెల్‌లో హ్యాట్రిక్ కూడా తీసి చరిత్ర సృష్టించింది. వైష్ణవి తన చివరి ఓవర్‌లో ఈ అద్భుతం చేసింది. 14వ ఓవర్లో మలేషియాకు చెందిన నూర్ ఎన్, నూర్ ఇస్మా దానియా, సితి నజ్వాలను వరుసగా మూడు బంతుల్లో అవుట్ చేయడం ద్వారా వైష్ణవి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వైష్ణవికి ఇదే తొలి మ్యాచ్ కావడం, తొలి మ్యాచ్‌లోనే ఈ అద్భుతం చేయడం అద్భుతం.

హ్యాట్రిక్‌పై వైష్ణవి ఏం చెప్పిందంటే?

హ్యాట్రిక్ కొట్టిన తర్వాత తన కల నెరవేరిందని వైష్ణవి చెప్పుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆడబోతున్నట్లు కెప్టెన్ ఆమెకు ముందే చెప్పింది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన వెంటనే అద్భుత ప్రదర్శన చేసింది. అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రీడాకారిణిగా వైష్ణవి నిలిచింది. టోర్నీ చరిత్రలో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. భారత్‌కు చెందిన ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.

మలేషియాపై టీమిండియా ఆధిపత్యం..

భారత జట్టు దెబ్బకు మలేషియా కేవలం 31 పరుగులకే ఆలౌటైంది. మలేషియా జట్టు 14.3 ఓవర్లు మాత్రమే క్రీజులో నిలువగలిగింది. మలేషియాకు చెందిన ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నలుగురు బ్యాటర్స్ ఖాతాలు కూడా తెరవలేదు. వైష్ణవి శర్మ కంటే ముందు మలేషియా జట్టు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆయుషి శుక్లా చేతికి చిక్కింది. 3.3 ఓవర్లలో 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. ఆ తర్వాత వైష్ణవి శర్మ ఒంటరిగా సగం జట్టును నాశనం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..