AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 ఏళ్లుగా దూరం పెట్టిన బీసీసీఐ సెలెక్టర్లు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ బాటలో టీమిండియా స్టార్ ప్లేయర్..?

Mohammed Shami Retirement: బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికల్లో అతని స్థానం ఏమిటనేది పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తనంతట తానుగా ఆటకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకోలేదు. ఈ వార్త ఆయన అభిమానులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.

2 ఏళ్లుగా దూరం పెట్టిన బీసీసీఐ సెలెక్టర్లు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ బాటలో టీమిండియా స్టార్ ప్లేయర్..?
Mohammed Shami
Venkata Chari
|

Updated on: Nov 07, 2025 | 1:23 PM

Share

టీమిండియా (Team India) స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారనే పుకార్లు ఇటీవల పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వివిధ సిరీస్‌లకు భారత జట్టు (Indian Squad) ఎంపికలో అతనికి వరుసగా స్థానం దక్కకపోవడంతో, అతని భవిష్యత్తుపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులలో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా వచ్చిన ఒక నివేదిక ఈ రిటైర్మెంట్ చర్చ మధ్య ఒక ఆశాకిరణాన్ని అందిస్తోంది.

సెలెక్షన్ స్నబ్, పుకార్లు..

మహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup) అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పునరాగమనం చేసినా, టెస్ట్ ఫార్మాట్‌లో (Test Format) ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా (South Africa) వంటి సిరీస్‌లకు కూడా అతని పేరు పరిశీలించలేదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, అతనికి సీనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చూసి, సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదని, త్వరలో అతను రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటి?..

ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు బీసీసీఐ లేదా మరే ఇతర అధికారిక సంస్థ తీర్పు ఇవ్వలేదని స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

ఈ పుకార్లపై మొహమ్మద్ షమీ గతంలో చాలా గట్టిగా స్పందించారు. తనకు విసుగు వచ్చే వరకు లేదా ఆటపై కోరిక తగ్గే వరకు ఆడతానని, ఇతరుల డిమాండ్ మేరకు తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) గెలవాలనే తన కల ఇంకా మిగిలి ఉందని కూడా ఆయన తెలిపారు.

ఫిట్‌నెస్, డొమెస్టిక్ క్రికెట్: షమీ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌‌పై, దేశవాళీ టోర్నమెంట్‌లలో సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాడు. అంటే, అతను ఇంకా ఉన్నత స్థాయి క్రికెట్ ఆడటానికి సిద్ధంగానే ఉన్నాడని దీని అర్థం.

సెలెక్టర్ల ప్రణాళికల్లో అతని స్థానం ఏమిటనేది పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, మొహమ్మద్ షమీ తనంతట తానుగా ఆటకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకోలేదు. ఈ వార్త ఆయన అభిమానులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. షమీ త్వరలో పూర్తి ఫిట్‌నెస్‌తో భారత జట్టు జెర్సీలో బౌలింగ్ చేయడం చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..