AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 3rd T20 Playing 11: సిరీస్‌ నిలవాలంటే ఈ ప్లేయర్ బయటకు వెళ్లాల్సిందేనా.. 3వ T20లో ప్లేయింగ్ 11లో ఓ కీలక మార్పు?

IND Vs WI T20 Match Prediction Squads: వెస్టిండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొంది. ఈ కారణంగా టీమిండియా ప్లేయింగ్-11లో మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. లేదంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడడం కష్టమే. ఎందుకంటే మూడో మ్యాచ్ హార్దిక్ సేనకు చాలా కీలకం.

IND vs WI 3rd T20 Playing 11: సిరీస్‌ నిలవాలంటే ఈ ప్లేయర్ బయటకు వెళ్లాల్సిందేనా.. 3వ T20లో ప్లేయింగ్ 11లో ఓ కీలక మార్పు?
Team India Vs West Indies
Venkata Chari
|

Updated on: Aug 08, 2023 | 9:17 AM

Share

IND vs WI 3rd T20 Playing 11: వెస్టిండీస్ టూర్ భారత టీ20 జట్టుకు ఇంతవరకు అనుకూంలంగా లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక మ్యాచ్‌లో ఓటమి అంటే సిరీస్‌ను కోల్పోనుంది. దీంతో మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎలాగైనా గెలవాల్సిందే. అదే సమయంలో సిరీస్ గెలవాలంటే వచ్చే మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో మ్యాచ్ తర్వాత పాండ్యా కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్యాపై కూడా ఒత్తిడి ఉంటుంది. మూడో మ్యాచ్ చాలా ముఖ్యమైనది. అందువల్ల పాండ్యా ఎలాంటి ప్రయోగం లేకుండా తన అత్యుత్తమ ఆటతీరు- ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతాడా లేదా మార్పులు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

తొలి మ్యాచ్‌లో భారత జట్టు అతి చేరువకు వచ్చి ఓడిపోయింది . ఆ మ్యాచ్‌లో టీమ్‌ని గెలిపించే అవకాశం చాలా ఉంది. కానీ, టీమ్‌ఇండియా గెలవాలనే లక్ష్యంతో లేదు. ఇక రెండో మ్యాచ్ కూడా భారత్ చేతిలోనే ఉన్నట్లు అనిపించినా ఈ మ్యాచ్ కూడా టీమ్ ఇండియా చేతి నుంచి జారవిడుచుకుంది.

కుల్దీప్ రీఎంట్రీ..

రెండో మ్యాచ్‌లో భారత జట్టు మార్పు చేయాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను జట్టు ఎంపిక చేసింది. అయితే రెండో టీ20 మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కుల్దీప్ గాయపడటంతో టీమ్ ఇండియా బలవంతంగా ఈ మార్పు చేయాల్సి వచ్చింది. అందుకే రెండో మ్యాచ్ ఆడలేదు. కుల్దీప్ ఫిట్ గా ఉంటే తిరిగి రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ బయటకు వెళ్లాల్సి రావచ్చు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా జట్టులో ఓపెనింగ్ జోడీలోనూ మార్పు రావొచ్చని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌ల ఓపెనింగ్ జోడి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ వారిద్దరిపై నమ్మకం ఉంచుతుందా లేదా అనేది చూడాలి. ప్రయోగం చేయాలనిపిస్తే జైస్వాల్ ఓపెనింగ్ బరిలో నిలచే ఛాన్స్ ఉంది. రెండో మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ గురించి కచ్చితంగా ప్రకటన చేసినా మూడో మ్యాచ్‌లోనూ పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

వెస్టిండీస్ టీంలోనూ మార్పులా?

రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టీ20లో దిగిన జట్టుతోనే కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ దిగాడు. ఇక మూడో మ్యాచ్‌లోనూ పావెల్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఏ కెప్టెన్ తన విన్నింగ్ కాంబినేషన్‌కు భంగం కలిగించాలని అనుకోడు. పావెల్ మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టుతో సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని కోరుకుంటాడు.

ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11..

భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..