Team India: ఇదేం జోడీ రా బాబూ.. 30 పరుగులు చేయలేక చేతులెత్తేస్తున్నారు.. చెత్త ఓపెనర్స్‌గా మిగిలేస్తారా ఏంది?
India Vs West Indie: 27, 12, 3, 10, 17, 7, 5, 16... ఇది గత 8 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌ల భాగస్వామ్యం. అంటే పవర్‌ప్లేలోనే టీమిండియా తొలి వికెట్‌ను చేజార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 6 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మన్ గిల్ 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2వ టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 7 పరుగులు చేసి వికెట్ చేజార్చుకోగా..

India Vs West Indie: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా తడబడింది. క్రికెట్ లో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన భారత జట్టు కరీబియన్ దీవుల్లో సత్తా చాటేందుకు నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగులే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి.
తొలి టీ20 మ్యాచ్‌లో 145 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా 2వ మ్యాచ్‌లో 152 పరుగులకే చేతులెత్తేసి పరాజయం పాలైంది. అంటే బ్యాట్స్‌మెన్‌లకు పేరుగాంచిన భారత జట్టు.. పరుగులు సాధించలేక ఘెరంగా విఫలమవుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీలు శుభారంభం విఫలమవడం ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది.




విఫలమైన ఇషాన్, గిల్ జోడీ..
టీమిండియాకు ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమవుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. అంటే గిల్, ఇషాన్‌లు చివరి 8 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. తొలి వికెట్‌కు కనీసం 30 పరుగుల భాగస్వామ్యం కూడా చేయలేదు.
27, 12, 3, 10, 17, 7, 5, 16… ఇది గత 8 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌ల భాగస్వామ్యం. అంటే పవర్‌ప్లేలోనే టీమిండియా తొలి వికెట్‌ను చేజార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 6 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మన్ గిల్ 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2వ టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 7 పరుగులు చేసి వికెట్ చేజార్చుకోగా, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు.
అంటే టీమ్ ఇండియా ఇద్దరు ఓపెనర్లు పవర్‌ప్లేలో సందడి చేయడంలో విఫలమవుతున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ త్వరగానే వికెట్లు చేజార్చుకోవడం టీమ్ ఇండియాలో ఆందోళనను పెంచింది. అయితే మూడో టీ20 మ్యాచ్‌లోనైనా ఇషాన్, గిల్ భారత జట్టుకు శుభారంభం అందిస్తారో లేదో చూడాలి.
Ishan Kishan & Shubman Gill has the lowest batting average by an Indian pair in T20Is.😬 pic.twitter.com/PkVPTfUQDI
— CricketGully (@thecricketgully) August 5, 2023
డూ ఆర్ డై మ్యాచ్..
మంగళవారం భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. గయానా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిస్తే సిరీస్ కరేబియన్ దీవుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్.
ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11..
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




