IND Vs SL Highlights: 302 పరుగులతో టీమిండియా భారీ విజయం.. సెమీస్ చేరిన తొలి జట్టుగా రోహిత్ సేన..
India vs Srilanka, ICC world Cup 2023 Highlights: వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి.. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. ఇందులోనూ విజయం సాధించి అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది.

2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. దీనికి ముందు 2007లో బెర్ముడాపై 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు శ్రీలంకను 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ విజయంతో ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. 7 మ్యాచ్‌లు ఆడిన భారత్ 14 పాయింట్లతో టోర్నీలో అజేయంగా ఉంది.
వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి.. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. ఇందులోనూ విజయం సాధించి అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. వాంఖడే బ్యాటింగ్ పిచ్ కావడంతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీం నుంచి పరుగుల వరద పారే అవకాశం ఉంది. అటు ఆరు మ్యాచ్‌లలో రెండే నెగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉంది శ్రీలంక. లంకేయులు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
హెడ్ టూ హెడ్ రికార్డులు ఇలా..
భారత్, శ్రీలంక ఇప్పటివరకు 167 వన్డేల్లో తలబడ్డాయి. ఇండియా 98 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 సార్లు గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక చివరి 5 మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇండియా ఓటమనేది చవి చూడలేదు. అన్నింట్లోనూ అద్భుత విజయాలు అందుకుంది. శ్రీలంక మాత్రం 2 మ్యాచ్‌ల్లో ఓడి, మూడింట గెలిచింది.
జట్ల వివరాలు..
వాంఖడే స్టేడియంలో కచ్చితంగా పరుగుల వరద పారడం ఖాయం. ఆసియా కప్ ఫైనల్ రిపీట్ కాకపోతే.. శ్రీలంక బ్యాటర్ల నుంచి కూడా కొన్ని పరుగులను ఆశించవచ్చు. ఇక భారత్ జట్టు విషయానికొస్తే.. దాదాపుగా న్యూజిలాండ్‌తో తలబడిన జట్టే.. మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. షార్ట్ బంతులకు ఔట్ అవుతున్న శ్రేయాస్ అయ్యర్‌కి.. టీం మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అటు ఆఫ్గనిస్తాన్‌పై ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న శ్రీలంక జట్టు.. ఇండియాపై ఎలాగైనా గెలవాలని నెట్స్‌లో కఠోరంగా చెమటోడ్చింది.
మరిన్ని వరల్డ్‌కప్ వార్తల కోసం..
LIVE Cricket Score & Updates
-
చిత్తుగా ఓడిన లంక.. సెమీస్ చేరిన భారత్..
2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. దీనికి ముందు 2007లో బెర్ముడాపై 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
5 వికెట్లతో సత్తా చాటిన షమీ..
లంకపై షమీ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 5 వికెట్లతో సత్తా చాటటడంతో మొత్తంగా వన్డే ప్రపంచ కప్‌లో 45 వికెట్లు పడగొట్టి, టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.
-
-
8వ వికెట్ కోల్పోయిన లంక..
షమీ అద్భుత బౌలింగ్‌తో 4వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాథ్యూస్ (12) బౌల్డ్ చేయడంతో శ్రీలంక 8వ వికెట్ కోల్పోయింది. దీంతో లంక 14 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.
-
కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే రివ్యూ..
కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే రివ్యూతో శ్రీలంక టీం 7వ వికెట్ కోల్పోయింది. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన లంక 22 పరుగులు చేసింది.
-
షమీ రాగానే వికెట్..
ఇప్పటి వరకు లంకను ఇబ్బంది పెట్టిన బుమ్రా(1), సిరాజ్(3)..లకు తోడుగా రంగంలోకి దిగిన షమీ.. తన తొలి ఓవర్ మూడో బంతికి అసలంక(1)ను, 4వ బంతికి హేమంత్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో లంక 9.4 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది.
-
-
సిరాజ్ దూకుడు..
లంక జట్టును బుమ్రా, సిరాజ్ వరుసగా షాక్‌ల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయిన లంకకు.. సిరాజ్ తన రెండో ఓవర్‌లో మరో షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్ తొలి బంతికే మరో వికెట్ పడగొట్టి, తన ఖాతాలో 3 వికెట్లు వేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక 3.1 ఓవర్లకు 3 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
-
శ్రీలంక మూడు ఓవర్లకు ఇలా..
భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో శ్రీలంక తడబడింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్‌లో బుమ్రా ఒక వికెట్.. రెండో ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు సిరాజ్. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 3 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
-
టీమిండియా 357 రన్స్..
వాంఖడే స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. శ్రీలంకపై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో గిల్ 92 పరుగులు, కోహ్లీ 88 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. వీరి ముగ్గురు సెంచరీలు చేయకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచినప్పటికీ.. భారత్ మాత్రం లంకేయుల ముందు భారీ టార్గెట్ ఉంచింది.
-
టీమిండియా 45 ఓవర్లకు ఇలా..
టీమిండియా 45 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జడేజా(10), శ్రేయాస్ అయ్యర్(59) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
-
టీమిండియా 40 ఓవర్ల స్కోర్ ఇలా..
టీమిండియా 40 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(8), శ్రేయాస్ అయ్యర్(38) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్‌గా కెఎల్ రాహుల్ 21 వ్యక్తిగత పరుగుల కు పెవిలియన్ చేరాడు.
-
35 ఓవర్లకు భారత్ స్కోర్ ఇలా..
టీమిండియా 35 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(20), కెఎల్ రాహుల్(10) క్రీజులో ఉన్నారు. టీమిండియా మూడో వికెట్‌గా విరాట్ కోహ్లి(88) పెవిలియన్ చేరాడు.
-
విరాట్ కోహ్లి అవుట్..
టీమిండియా మూడో వికెట్‌గా విరాట్ కోహ్లి(88) పెవిలియన్ చేరాడు. వాంఖడే స్టేడియంగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీ చేస్తాడని అందరూ ఊహించారు. కానీ మధుశంక వేసిన ఓ స్లో బంతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లి. దీంతో సచిన్ 50 సెంచరీల రికార్డు పదిలం అని మాస్టర్ బ్లాస్టర్ ఫ్యాన్స్ అంటున్నారు.
-
30 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఇలా..
30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(87) పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో వికెట్‌గా గిల్ 92 పరుగులకు అవుట్ అయ్యాడు.
-
150 దాటిన స్కోర్..
25 ఓవర్లకు టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 151 పరుగులు సాధించింది. కోహ్లీ 73, గిల్ 65 పరుగులతో నిలిచారు.
-
15 ఓవర్లకు స్కోర్..
15 ఓవర్లు ముగిసే టీమిండియా 88 పరుగులు చేసింది. విరాట్ 41, గిల్ 35 పరుగులతో నిలిచారు.
-
60 దాటిన స్కోర్..
10 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. విరాట్ 28, గిల్ 22 పరుగులతో నిలిచారు.
-
లంక బౌలింగ్ అదుర్స్..
కొత్త బంతితో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్‌ను పెవిలియన్ చేర్చిన లంక బౌలర్లు.. విరాట్, గిల్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 25 పరుగులు చేసింది.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
తొలి ఓవర్ రెండో బంతికి టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు.
-
శ్రీలంక తుది జట్టు ఇదే..
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(వికెట్ కీపర్/కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
CWC 2023. Sri Lanka XI: D Karunaratne, P Nissanka, K Mendis (C/WK), C Asalanka, A Mathews, S Samarawickrama, D Hemantha, D Chameera, M Theekshana, K Rajitha, D Madushanka. https://t.co/B6bRzb775S #INDvSL #CWC23
— BCCI (@BCCI) November 2, 2023
-
భారత్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
CWC 2023. India XI: R Sharma (c), S Gill, V Kohli, S Iyer, KL Rahul (WK), S Yadav, R Jadeja, M Shami, K Yadav, M Siraj, J Bumrah. https://t.co/B6bRzb775S #INDvSL #CWC23
— BCCI (@BCCI) November 2, 2023
-
టాస్ గెలిచిన శ్రీలంక..
వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగే కీలక పోరులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధనంజయ్ డిసిల్వా గాయం కారణంగా ఔట్ కావడం.. అతడి స్థానంలో హేమంతా తుది జట్టులోకి వచ్చాడు.
CWC 2023. Sri Lanka won the toss and elected to field. https://t.co/B6bRzb775S #INDvSL #CWC23
— BCCI (@BCCI) November 2, 2023
-
అమీతుమీ..
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, శ్రీలంక వాంఖడే స్టేడియం వేదికగా తలబడనున్నాయి. ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. ఇందులో విజయం సాధించి.. సెమీస్ చేరాలని భావిస్తుంటే.. మరోవైపు శ్రీలంక రోహిత్ సేనపై విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.
Hello from the Wankhede Stadium, Mumbai! 🏟️
Ready for another cracking contest 👌
🆚 Sri Lanka ⏰ 2 PM IST 🖥️ https://t.co/Z3MPyeL1t7#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/OhVFMamKFg
— BCCI (@BCCI) November 2, 2023
Published On - Nov 02,2023 1:00 PM




