AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: వాంఖడేలో 12 ఏళ్ల చరిత్ర పునరావృతం అవుతుందా? లంకతో పోరుకు సిద్ధమైన భారత్..

IND vs SL, ICC World Cup 2023 Live Streaming: 2023 ప్రపంచకప్‌లో రోహిత్ సేన అజేయ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను ఓడించిన భారత జట్టు ఇప్పుడు ముంబై చేరుకుంది. ఇప్పుడు శ్రీలంకపై కూడా అజేయంగా కొనసాగాలని భారత్ కోరుకుంటోంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిన శ్రీలంక మళ్లీ గెలుపుబాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది.

IND vs SL: వాంఖడేలో 12 ఏళ్ల చరిత్ర పునరావృతం అవుతుందా? లంకతో పోరుకు సిద్ధమైన భారత్..
Ind Vs Sl Cwc 2023
Venkata Chari
|

Updated on: Nov 01, 2023 | 7:30 PM

Share

ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023)లో, శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఏడవ మ్యాచ్ (India vs Sri Lanka) భాగంగా రేపు, నవంబర్ 2 న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇదే ఫీల్డ్‌లో 12 ఏళ్ల క్రితం 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టును ఓడించి 28 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోని (MS Dhoni) సారథ్యంలో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ మైదానంలో మరోసారి వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే లంక జట్టు 12 ఏళ్ల క్రితం ఉన్నంత పటిష్టంగా లేదు. అందుకే రేపటి మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

2023 ప్రపంచకప్‌లో రోహిత్ సేన అజేయ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను ఓడించిన భారత జట్టు ఇప్పుడు ముంబై చేరుకుంది. ఇప్పుడు శ్రీలంకపై కూడా అజేయంగా కొనసాగాలని భారత్ కోరుకుంటోంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిన శ్రీలంక మళ్లీ గెలుపుబాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే భారత గడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ ఇండియాను ఓడించడం సింహళీయులకు అంత తేలికైన విషయం కాదు.

మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో..

భారత్, శ్రీలంక మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఎప్పుడు?

నవంబర్ 2వ తేదీ గురువారం భారత్-శ్రీలంక మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.

భారత్-శ్రీలంక మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్-శ్రీలంక మధ్య ప్రపంచకప్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్‌లో టాస్ 1:30 గంటలకు జరుగుతుంది.

ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇది కాకుండా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌లో ఫ్రీగా చూడోచ్చు.

జట్లు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, కుసల్ పెరీరా, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు