AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 6 సిక్సర్లు, 37 ఫోర్లు.. 3 హాఫ్ సెంచరీలతో 339 పరుగులు.. హార్దిక్ సేనకు చుక్కలు చూపేందుకు సిద్ధమైన ప్లేయర్..

IND vs SL: టీమిండియాతో టీ20 సిరీస్ మంగళవారం నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ అవిష్క ఫెర్నాండో భారత బౌలర్లకు పెద్ద ముప్పుగా మారవచ్చని తెలుస్తోంది.

IND vs SL: 6 సిక్సర్లు, 37 ఫోర్లు.. 3 హాఫ్ సెంచరీలతో 339 పరుగులు.. హార్దిక్ సేనకు చుక్కలు చూపేందుకు సిద్ధమైన ప్లేయర్..
Ind Vs Sl 1st T20i Avishka
Venkata Chari
|

Updated on: Jan 02, 2023 | 7:33 PM

Share

India vs Sri Lanka T20I: శ్రీలంకతో టీ20 సిరీస్‌తో టీమ్ ఇండియా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతోంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో, భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగా, కమాండ్ హార్దిక్ పాండ్యా చేతిలో నిలిచింది. యువ జట్టు ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. శ్రీలంక జట్టును తక్కువగా అంచనా వేయడం పెద్ద తప్పుగా మారుతుంది. లంక టీంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లలో అవిష్క ఫెర్నాండో అగ్రస్థానంలో ఉన్నాడు.

అవిష్క ఫెర్నాండో గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు ఇటీవల జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఎల్‌పీఎల్ (LPL) 2022లో అవిష్క అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు సదీర సమవిక్రమ కూడా బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టగల నలుగురు శ్రీలంక ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దుమ్మురేపిన అవిష్క ఫెర్నాండో..

లంక ప్రీమియర్ లీగ్ 2022లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవిష్క ఫెర్నాండో నిలిచాడు. ఈ ఆటగాడు 10 మ్యాచ్‌ల్లో 339 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 6 సిక్సర్లు, 37 ఫోర్లు వచ్చాయి. ఇందులో అవిష్క 3 అర్ధ సెంచరీలు చేశాడు. అతని జట్టు జాఫ్నా కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సదీర సమవిక్రమ..

లంక ప్రీమియర్ లీగ్‌లో సదీర సమవిక్రమ అద్భుత ప్రదర్శన చేశాడు. జాఫ్నా కింగ్స్ తరపున ఆడుతున్న ఈ ఆటగాడు 58 కంటే ఎక్కువ సగటుతో 294 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు టీమిండియా బౌలర్లకు సవాల్ విసరగలడు.

నువాన్ తుషార..

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే శక్తి ఉంది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తనదైన వేగంతో లంక ప్రీమియర్ లీగ్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో శ్రీలంక తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

కసున్ రజిత..

రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా మాంచి ఊపులో ఉన్నాడు. ఈ ఆటగాడు 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. రజిత ఎకానమీ రేటు 6.30గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..