IPL 2023: పంత్ స్థానాన్ని భర్తీ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు.?

మరి పంత్ ఇప్పుడు ఐపీఎల్‌కు దూరమైతే.. అతడి స్థానంలో కెప్టెన్ అయ్యేది ఎవరన్నది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. ఇక ఈ రేసులో ముగ్గురు ప్లేయర్స్..

IPL 2023: పంత్ స్థానాన్ని భర్తీ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు.?
Rishabh Pant
Follow us

|

Updated on: Jan 02, 2023 | 7:31 PM

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో.. పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నెలలు టైం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పంత్ స్వదేశంలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్ 2023 మొత్తం సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరి పంత్ ఇప్పుడు ఐపీఎల్‌కు దూరమైతే.. అతడి స్థానంలో కెప్టెన్ అయ్యేది ఎవరన్నది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. ఇక ఈ రేసులో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారని సమాచారం. వారిలో మాజీ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. అతడు కాకుండా.. పృథ్వీ షా, మనీష్ పాండే కూడా జట్టు సారధ్య బాధ్యతలు అందుకునే ఛాన్స్ ఉందట.

అయితే వీరిద్దరిలో కంటే డేవిడ్ వార్నర్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఐపీఎల్‌లో సారధ్య బాధ్యతలు చేపట్టిన అనుభవం, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ వార్నర్ సొంతం. డేవిడ్ భాయ్ కంటే ఎక్కువ అనుభవం మిగతా ఇద్దరికీ లేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వార్నర్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.