IND vs SA: పుజారా, రహానె మాత్రమే ముఖ్యం కాదు.. అందరు రాణించాలి.. ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు..
ఆదివారం సెంచూరియన్ టెస్టుతో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. రెండు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆదివారం సెంచూరియన్ టెస్టుతో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. రెండు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుంది. ఇప్పటి వరకు భారత జట్టు దక్షిణాఫ్రికాలో ఏ సిరీస్‌ని గెలవలేదు. భారత టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో పోరాడుతున్నారు. గత కొన్ని టెస్టు సిరీస్‌ల్లో ఇద్దరు ఆటగాళ్లు పరుగుల కోసం కష్టపడుతున్నారు.అందుకే ఈ సిరీస్ వారికి చాలా ముఖ్యమైంది. అయితే పుజారా, రహానే మాత్రమే కాకుండా మొత్తం జట్టు ప్రదర్శన టీమ్ ఇండియాకు అవసరమని టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లి అయినా, ఛెతేశ్వర్ పుజారా అయినా ఒకరు ఆడితే సిరీస్ గెలవలేమని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈ సిరీస్‌లో పుజారా సహకారం గణనీయంగా ఉంటుందని చెప్పాడు. “విరాట్ లేదా పుజారా మాత్రమే కాకుండా జట్టులోని ప్రతి ఒక్కరి సహకారంతో ఈ తరహా సిరీస్‌లు గెలుపొందుతామని మాకు తెలుసు. అందుకే అందరి సహకారం ముఖ్యం. పుజారా జట్టులో ముఖ్యమైన సభ్యుడు కానీ జట్టులో అందరి సహకారం చాలా ముఖ్యమైనది.” అని చెప్పాడు.
రహానె 2019 జనవరిలో చివరి సెంచరీ సాధించాడు. 2020 సంవత్సరంలో అతను 8 ఇన్నింగ్స్‌లలో 20.37 సగటుతో 163 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం అతను 24 ఇన్నింగ్స్‌లలో 29.82 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ అతను 4 ఇన్నింగ్స్‌ల్లో 95 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ పుజారా తన టెస్టు కెరీర్‌ను కాపాడుకోవాలంటే.. ఈ సిరీస్‌లో రాణించాల్సి ఉంటుంది. ‘మిగతా ఆటగాళ్లతో మాదిరిగానే రహానెతో చాలా సానుకూల సంభాషణ జరిగింది. ఈ వారం చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. అతను మంచి స్థితిలో ఉన్నాడు.” అని పేర్కొన్నాడు. విదేశాల్లో అజింక్యా రహానే రికార్డు అద్భుతంగా ఉంది. అతను విదేశీ గడ్డపై 40 కంటే ఎక్కువ సగటుతో 3000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
Read Also.. IND vs SA: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. అతను జట్టుకు సారథ్యం వహించిన తీరు అద్భుతం..