AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 2nd T20: కటక్‌లోనూ ఓటమి తప్పదా.. రికార్డ్ చూస్తే భారత్‌కు కష్టమే.. భారత్ ప్లేయింగ్ XIలో కీలక మార్పు?

కటక్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే.. వారికి కూడా టర్న్ వస్తుంది. భారత్‌తో ఇక్కడ జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు.

IND vs SA 2nd T20: కటక్‌లోనూ ఓటమి తప్పదా.. రికార్డ్ చూస్తే భారత్‌కు కష్టమే.. భారత్ ప్లేయింగ్ XIలో కీలక మార్పు?
Ind Vs Sa 2nd T20 Live
Venkata Chari
|

Updated on: Jun 12, 2022 | 9:57 AM

Share

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికా(IND vs SA) జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. ఈ మైదానంలో గతంలోనూ ఇరు జట్ల మధ్య ఘర్షణ జరిగింది. 2015లో ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరు జట్లు ముఖాముఖిగా ఇక్కడ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. భారత్ తరపున ఇషాన్ కిషన్(Ishan Kishan) అత్యధికంగా 76 పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

దక్షిణాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ 64, రెసీ వాన్ డెర్ డస్సెన్ 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 131 పరుగులు జోడించి తమ జట్టుకు సులువైన విజయాన్ని అందించారు. టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా శనివారం చెమటోడ్చారు. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు అతడి ప్రతి షాట్‌పై సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

పిచ్ ఎలా ఉంటుంది?

కటక్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే.. వారికి కూడా టర్న్ వస్తుంది. భారత్‌తో ఇక్కడ జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్స్ భారీ స్కోరు చేసినా నేటి మ్యాచ్‌లో వారికి పరీక్ష రావొచ్చు. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మైదానంలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ మైదానంలో చాహల్ 4 వికెట్లు తీశాడు. అదే సమయంలో, హార్దిక్ పాండ్యా పేరుతో 3 వికెట్లు ఉన్నాయి.

వాతావరణం..

కటక్‌లో పగటి ఉష్ణోగ్రత 35-38 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండవచ్చు. అదే సమయంలో, ఇది రాత్రికి 28 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. అయితే, మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

జట్లు ప్లేయింగ్ XIని మారుస్తాయా?

రెండవ T20 కోసం, దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XIలో ఎటువంటి మార్పులు చేయదు. కానీ, టీమ్ ఇండియాలో మాత్రం మార్పులు చూడొచ్చు. తొలి మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ల స్పీడ్‌ చాలా తక్కువగా ఉండడంతో వీరిద్దరూ ఘోరంగా దెబ్బతిన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం దక్కవచ్చు. పిచ్ ఫ్లాట్‌గా ఉంటే, ఉమ్రాన్ తన ఫాస్ట్ డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.

లైవ్ ఎక్కడ చూడాలి?

రెండో టీ20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్ స్టార్ స్పోర్ట్స్-1, స్టార్ స్పోర్ట్స్-1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్-1 హిందీ, స్టార్ స్పోర్ట్స్-1 హిందీ హెచ్‌డీలలో ప్రసారం చేయనుంది. అదే సమయంలో, మీరు డిస్నీ + హాట్‌స్టార్‌లో మ్యాచ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ను చూడొచ్చు.

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు..

భారత్- రిషబ్ పంత్ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్, రెసీ వాన్ డెర్ డస్సెన్, టెంబా బావుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, వేన్ పెర్నెల్, తబరిజ్ షమ్సీ, కగిసో రబడ, ఎన్రిక్ నోర్త్యా, కేశవ్ మహరాజ్.