IND Vs PAK: దాయాదుల పోరుకు డేట్ ఫిక్స్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మ్యాచ్ జరిగేది ఎప్పుడంటే.?

పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా జట్టు పాకిస్తాన్‌కు పయనం అవుతుందా.? లేదా.? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే.. ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ మాత్రం జోరుగా సన్నద్దమవుతోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో..

IND Vs PAK: దాయాదుల పోరుకు డేట్ ఫిక్స్.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మ్యాచ్ జరిగేది ఎప్పుడంటే.?
Champions Trophy
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:44 PM

పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా జట్టు పాకిస్తాన్‌కు పయనం అవుతుందా.? లేదా.? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే.. ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ మాత్రం జోరుగా సన్నద్దమవుతోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి కూడా కీలక అప్‌డేట్ వచ్చేసింది. దాయాదుల మధ్య భీకర పోరు 2025, మార్చి 1న లాహోర్ వేదికగా జరగనున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా మిగతా షెడ్యూల్‌పై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. మార్చి 10 ఫైనల్ కోసం రిజర్వ్ డేగా ఉంచింది ఐసీసీ. అందుతున్న రిపోర్టుల ప్రకారం గ్రూప్-ఎలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో పాటు భారత్.. అలాగే గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి 15 మ్యాచ్‌ల తాత్కాలిక షెడ్యూల్‌ను పీసీబీ సమర్పించిందని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు పీటీఐకి చెప్పారు. లాహోర్‌లో ఏడు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే భద్రత, ట్రావెల్ కారణాల దృష్ట్యా టీమిండియా అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లో ఉండనున్నాయి. ప్రారంభ మ్యాచ్ కరాచీలో జరగనుండగా, రెండు సెమీఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో.. ఇక ఫైనల్ మ్యాచ్‌లో లాహోర్‌లో జరుగుతాయి.

2023లో జరిగిన ఆసియా కప్‌ పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన చివరి టోర్నీ. కానీ టీమిండియా కారణంగా ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిపారు. తమ మ్యాచ్‌లు అన్నింటినీ భారత్.. శ్రీలంక వేదికగా ఆడింది. అలాగే ఫైనల్ కూడా లంకలోనే జరిగింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాలా.? లేదా.? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక ఐసీసీ ఆయా దేశాల నిర్ణయానికి విరుద్దంగా ఏ క్రికెట్ బోర్డును బలవంతం చేయదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు