Team India: ఎంట్రీ అదుర్స్.. ఛాంపియన్స్‌ వచ్చేశారోచ్.. టీమిండియా ప్లేయర్లకు గ్రాండ్ వెల్​కమ్..

ఛాంపియన్స్‌ వచ్చేశారు.. టీ-20 వరల్డ్‌కప్‌తో ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకి ఘనస్వాగతం లభించింది.. 20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 5 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది..

Team India: ఎంట్రీ అదుర్స్.. ఛాంపియన్స్‌ వచ్చేశారోచ్.. టీమిండియా ప్లేయర్లకు గ్రాండ్ వెల్​కమ్..
Team India
Follow us

|

Updated on: Jul 04, 2024 | 9:04 AM

ఛాంపియన్స్‌ వచ్చేశారు.. టీ-20 వరల్డ్‌కప్‌తో ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకి ఘనస్వాగతం లభించింది.. 20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 5 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.. కప్‌ గెలిచిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉన్నా బెరిల్ తుపాను కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయిన భారత జట్టు ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్​ పోర్ట్​కు చేరుకున్న వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్​ ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు అక్కడికి చేరుకుని.. టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికారు.. ‘భారత్ మాతా కీ జై’.. ‘ఇండియా ఇండియా’ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.అనంతరం క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు.

లైవ్ వీడియో చూడండి..

ప్రస్తుతం ఐటీసీ మౌర్య అండ్ రియాక్స్‌ హోటల్‌ ఉన్న ప్లేయర్స్‌.. మరికాసేపట్లో ప్రధాని మోదీ ఇంటికి వెళ్లానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహన్నం 12 గంటల దాకా మోదీతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణం అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు ముంబైకి చేరుకుంటారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు ముంబై నారీమన్‌ పాయింట్‌ నుంచి విక్టరీ పరేడ్‌ మొదలవుతుంది. రాత్రి 7 నుంచి ఏడున్నర్ మధ్య వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం ఉంటుంది.

టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007 ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ ఇప్పుడు మళ్లీ కప్ సాధించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్ 29 జరిగిన ఫైనాల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించిన భారత్ పొట్టి కప్ ను ఎగురేసుకెళ్లింది.