IND vs NZ: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రోహిత్.. ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాలే.. ఆ రికార్డు ఏంటంటే?
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ బాదితే..
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ బాదితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 450 సిక్సర్లు పూర్తయినట్లే. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. అతని కంటే ముందు షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్ ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ భారత ఆటగాడు 450 సిక్సర్లు కొట్టలేకపోయాడు.
అదే సమయంలో రోహిత్ బ్యాట్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎనిమిది సిక్సర్లు బాదితే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 150 సిక్సర్లు బాదినట్టే. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. అతని కంటే ముందు, మార్టిన్ గప్టిల్ మాత్రమే పొట్టి ఫార్మాట్‌లో 150 సిక్సర్లు కొట్టాడు.
చాహల్‌కు తొలి మ్యాచులో అవకాశం లభించలేదు. అయితే నేటి రెండో టీ20లో అవకాశం లభిస్తే మాత్రం ఓ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. ఈ ఆటగాడు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకుంటే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవచ్చు.
కివీస్‌పై చాహల్ 4 వికెట్లు తీస్తే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలవనున్నాడు. అదే సమయంలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో 8 వికెట్లు సాధిస్తే టీ20 క్రికెట్‌లో (దేశీయ, అంతర్జాతీయ) 250 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నివనున్నాడు.
4⃣8⃣ Runs 3⃣6⃣ Balls 5⃣ Fours 2⃣ Sixes
Captain @ImRo45 narrowly missed out on his fifty but set the ball rolling for #TeamIndia in the chase. ? #INDvNZ @Paytm
Watch his fine knock ? ?
— BCCI (@BCCI) November 17, 2021