AB de Villiers Retires: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్‌..

AB de Villiers RCB: దక్షిణాఫ్రికా క్రికెటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌ అభిమానులకు షాకిచ్చాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి  ఫ్యాన్స్ ను ఆశ్యర్యపరిచాడు..

AB de Villiers Retires: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్‌..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Nov 19, 2021 | 2:56 PM

దక్షిణాఫ్రికా క్రికెటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌ అభిమానులకు షాకిచ్చాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి  ఫ్యాన్స్ ను ఆశ్యర్యపరిచాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ సౌతాఫ్రికా క్రికెటర్‌.. తాజా నిర్ణయంతో ఇక ఐపీఎల్‌లోనూ అతను కనిపించడు. దీంతో అతని అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌-2021లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ మొత్తం 31.30 సగటుతో 331 పరుగులు చేశాడు. అదేవిధంగా ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.70 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఏబీడీ తన రిటైర్మెంట్ ప్రకటనతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేశాడు.

క్రికెట్‌ నాకు చాలా ఇచ్చింది.. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన డివిలియర్స్‌…’ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు పెరటిలో మా అన్నయ్యలతో మ్యాచ్‌ మొదలు.. ఇప్పటి వరకు ఎంతో ఆనందంతో, హద్దుల్లేని ఉత్సాహంతో ఆట ఆడాను. ప్రస్తుతం నా వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జ్వాల అంతగా ప్రకాశవంతంగా మండదు. నా జీవితంలో క్రికెట్‌ ఎన్నో ఇచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు, టైటాన్స్‌, ఆర్‌సీబీ ఇలా ప్రపంచంలో ఏ జట్టు తరఫున ఆడినా నాకు ఊహించని అనుభూతులు, అవకాశాలను అందించింది. నేను ఎప్పుడూ క్రికెట్‌కు రుణపడి ఉంటాను’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. తద్వారా వయోభారం వల్లనే తాను తప్పుకుంటున్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడీ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌.

Also  Read:

Harbhajan Singh: వికెట్‌ కీపర్‌గా మారిన భజ్జీ.. వైరలవుతోన్న హర్భజన్‌ గల్లీ క్రికెట్‌ వీడియో..

Chris Gayle: క్రికెట్‎ను ఇప్పట్లో వదలను.. ఇంకా ఆడాలని ఉంది..

Tim Paine: ‘సెక్స్టింగ్’ వివాదంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‎.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ పైన్..