Chris Gayle: క్రికెట్‌ను ఇప్పట్లో వదలను.. ఇంకా ఆడాలని ఉంది..
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు. తాను క్రికెట్‌ను వదలడం లేదని గేల్ గురువారం తెలిపాడు. ‘నేను వదిలి వెళ్లడం లేదు..’ అని గేల్ ట్వీట్ చేశాడు...
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు. తాను క్రికెట్‌ను వదలడం లేదని గేల్ గురువారం తెలిపాడు. ‘నేను వదిలి వెళ్లడం లేదు..’ అని గేల్ ట్వీట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ చివరి మ్యాచ్ తర్వాత తన స్వస్థలమైన జమైకాలో వీడ్కోలు ఆట ఆడాలనుకుంటున్నందున అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని గేల్ చెప్పాడు. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జగిరిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్నప్పుడు సహచరులు ప్రశంసించారు. అతను అవుట్ అయిన తర్వాత మైదానానికి సెల్యూట్ చేసాడు, ప్రేక్షకులపైకి గ్లోవ్స్ విసిరాడు. సహచరుల నుంచి గాడ్ ఆఫ హానర్ అందుకున్నాడు కూడా.
I Ain’t Leaving…
— Chris Gayle (@henrygayle) November 18, 2021
“నేను మరో ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నాను. కానీ వారు నన్ను అనుమతించరని నేను అనుకోను. ఇది ఒక అద్భుతమైన కెరీర్. నేను ఎలాంటి రిటైర్‌మెంట్‌ను ప్రకటించలేదు కానీ నిజానికి జమైకాలో వాళ్లు నాకు ఒక గేమ్‌ను అందించారు. నా ఇంటి ప్రేక్షకులు, అప్పుడు నేను ‘హే అబ్బాయిలు, చాలా ధన్యవాదాలు’ అని చెప్పగలను. చూద్దాం’ అని ఐసీసీ పోస్ట్ మ్యాచ్ ఫేస్‌బుక్ లైవ్ షోలో గేల్ చెప్పాడు. 79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేల్లో అనుభవజ్ఞుడైన గేల్ అంతర్జాతీయ కెరీర్ 22 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే అతడు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2012, 2016లో ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టులో గేల్ సభ్యుడిగా ఉన్నాడు. గేల్ అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా ఉన్నాడు.
Read Also.. cheteshwar pujara: పుజారాకు క్షమాపణలు చెప్పిన రఫీక్, జాక్ బ్రూక్స్.. ఎందుకంటే..
Martin Guptill: అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం.. అతడు వేసే బంతులు వైవిధ్యంగా ఉంటాయి..